కరోనా ప్రభావంతో కుప్పకూలుతున్న మార్కెట్లు...

Balachander

కరోనా ప్రభావం రానురాను తీవ్రతరం అవుతున్నది. ఈరోజు ఉదయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఉదయం కొద్దిగా లాభదాయకంగానే మొదలు పెట్టాయి.  కానీ, మధ్యాహ్నం నుంచి పరిస్థితి మారిపోయింది.  ఒక్కసారిగా మార్కెట్లు కుప్పకూలిపోవడం మొదలుపెట్టాయి.  ఉదయం వరకు ఉన్న పరిస్థితికి మధ్యాహ్నం తరువాత పరిస్థితికి మార్పులు వచ్చాయి.  ముఖ్యంగా ఉదయం వరకు ముగ్గురు పేషేంట్లు మాత్రమే ఉన్నట్టుగా గణాంకాలు వచ్చాయి.  


ఆ తరువాత పరిస్థితి మారిపోయింది.  మొత్తం 28 మందికి కరోనా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దాని ప్రభావం మార్కెట్లపై పడింది.  మార్కెట్లు వరసగా కుప్పకూలిపోవడం మొదలుపెట్టాయి.  మధ్యాహ్నం 1.44 గంటల సమయంలో 760 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 37,862 వద్దకు.. 199 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,104 వద్దకు చేరాయి.  

 

ఇక ఇదిలా ఉంటె దేశంలో 28 కేసులు నమోదు కావడం అదీ కూడా ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా రావడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఢిల్లీ 1, ఆగ్రాలో 6, రాజస్థాన్ లో ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టులకు 17 మందికి వైరస్ సోకింది.  అదే విధంగా, హైదరాబాద్ లో ప్రస్తుతం ఒకరికి వైరస్ సోకిన విషయం తెలిసిందే.  


ప్రపంచం మొత్తం మీద ఈ వైరస్ వలన 3000 మందికి పైగా మరణించారు.  80వేలమందికి పైగా ఇబ్బందులు పడుతున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రపంచబ్యాంక్ గ్రాంట్ ను రిలీజ్ చేసింది.  వైరస్ ను కనుగొనడానికి సహాయసహకారాలు అందిస్తోంది. మరి వైరస్ కు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.  ఎలా అరికడతారో అని ప్రజలు భయపడుతున్నారు. వ్యాక్సిన్ లేకపోవడమే దీని అంతటికి కారణం అని అంటున్నారు.  వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  మరి చూద్దాం ఏం జారుతుందో.  ఎలా అరికడతారో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: