హెరాల్డ్ బర్త్ డే : 27-02-2020 రోజున జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసా..?

praveen

ఫిబ్రవరి 27వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూసి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 వెగే  నాగేశ్వరరావు జననం : సుప్రసిద్ధ కవి ఆర్థిక వైద్యశాస్త్ర నిపుణులు అయిన నాగేశ్వరరావు 1932 ఫిబ్రవరి 27వ తేదీన జన్మించారు. ఆయన బహుభాషావేత్త. వివిధ భాషల్లో ఎన్నో కవితలు రాశారు. 

 

 

 బి.ఎస్.యడ్యూరప్ప జననం :ప్రముఖ  రాజకీయ నాయకుడు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ఒకరైన బి.ఎస్.యడ్యూరప్ప 1943 ఫిబ్రవరి 27వ తేదీన జన్మించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో షికారిపుర తాలూకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎడ్యురప్ప. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక 1983 సంవత్సరంలో షికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో అడుగుపెట్టారు ఎడ్యూరప్ప. 2007 సంవత్సరంలో కర్ణాటక ఎన్నికల్లో  అనంతరం జనతాదళ్ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. 

 

 

 1983 నుంచి వరుసగా అదే స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తూ వచ్చారు ఎడ్యూరప్ప. 2007 నవంబర్ లో జనతా దళ్ బిజెపికి మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రపతి పాలన కర్ణాటకలో విధించబడింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో 2008లో  రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు ఎడ్యూరప్ప, అయితే దక్షిణ భారత దేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేతగా కూడా రికార్డ్ సృష్టించారు. ఇక మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో... బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకునేందుకు సరైన మెజారిటీ రాకపోవడంతో... జేడీఎస్  కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే... అయినప్పటికీ అధికారంపై పట్టుదలగా ఉన్న ఎడ్యూరప్ప  కాంగ్రెస్ జెడిఎస్ పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడంతో సంకీర్ణ ప్రభుత్వం కాస్త కూలిపోయింది. ఇక ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుని ప్రస్తుతం కర్నాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: