సీఎం జగన్ కు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్...!

Reddy P Rajasekhar

ఏపీ సీఎం జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర హోం శాఖ చిన్నారుల, మహిళల అత్యాచారం, హత్య కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు, బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై కసరత్తు చేపట్టింది. కేంద్రం దిశ బిల్లుకు చట్ట రూపం కల్పించే బాధ్యతలను మొదలుపెట్టింది. కేంద్ర హోం శాఖ కొన్ని సాంకేతిక అంశాల గురించి ఏపీ ప్రభుత్వాన్ని వివరాలను కోరగా ప్రభుత్వం వాటిని అందజేసింది. 
 
ఏపీ ప్రభుత్వం అడిగిన వివరాలన్నీ సమర్పించటంతో కేంద్రం దిశ బిల్లుకు చట్టరూపం ఇచ్చే దిశగా చర్యలు ప్రారంభించింది. మూడు నెలల క్రితం దిశ అనే యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. 
 
దిశ లాంటి ఘటనలు ఏపీలో చోటు చేసుకోకుండా ఉండాలని సీఎం జగన్ అసెంబ్లీలో దిశ బిల్లును ప్రవేశపెట్టటంతో పాటు ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వానికి దిశ బిల్లుకు చట్ట రూపం ఇవ్వడం కొరకు పంపించారు. ఏపీ దిశ చట్టం - 2019 ద్వారా 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు జరిపి, విచారణ పూర్తి చేసి దోషులకు కఠిన శిక్షలు పడేలా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 
 
రాష్ట్రంలో ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం అయ్యాయి. సీఎం జగన్ జగన్ చేతుల మీదుగా దిశ యాప్ కూడా ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ కొన్ని రోజుల క్రితం విచారణ, ప్రత్యేక కోర్టులు, శిక్ష అమలులో వెసులుబాటు, ఇతర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుండి కోరింది. కేంద్ర హోం శాఖ న్యాయ నిపుణులతో దిశ చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి సంప్రదింపులు జరుపుతోంది. అతి త్వరలో దిశ బిల్లు చట్ట రూపం దాల్చనుందని తెలుస్తోంది. కేంద్రం దిశ చట్టాన్ని ఆమోదించిన తరువాత రాష్ట్రపతి రాజముద్ర అనంతరం దిశ చట్టం అమలులోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: