పవణ్ కళ్యాణ్ కి బిగ్ షాక్... మరో రాజీనామా లెటర్
జనసేన పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నేత రాజీనామ చేశారు. రెడ్ రెవల్యూషన్ రూపకర్త కస్తూరి సత్యప్రసాద్ (నాని) తన రాజీనామ లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు.
అయితే.. తాను పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారో.. దానికి గల కారణాలను రాజీనామ లేఖలో ప్రస్తావించారు. కస్తూరి సత్యప్రసాద్ ఏపీ ఎన్నికలకు ముందు నిడదవోలు జనసేన పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. తాను పార్టీలో లేకపోయినా అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని.. తాను స్థాపించిన రెడ్ రెవెల్యూషన్ ద్వారా ప్రజల సమస్యల పై పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు.
రెడ్ రెవల్యూషన్ పేరుతో నియోజకవర్గంలోని గ్రామాల్లో సమస్యలను గోడలపైకి ఎక్కించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి గ్రామంలో ఒక గోడకు ఎరుపు రంగు వేసి దానిపై ఆ ఊరిలో ప్రధాన సమస్యలను రాయించి అధికారులు వాటిని పరీక్షించేలా కృషి చేశారు. ఆ తర్వాత గ్రామాల్లోని సమస్యలను జిల్లా కలెక్టర్ కు తెలియజేడానికి ఛలో ఏలూరు నిర్వహించారు. ఇలా మంచి కార్యక్రమాలు చేపట్టి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు కస్తూరి నాని.
నాని తన లేఖలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్‌కి, నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులకు కార్యకర్తలకు కస్తూరి నాని నమస్కరించి రాయునది నేను నిస్వార్ధంగా పార్టీ టికెట్ ఆశించకుండా పార్టీకి సేవ చేశాను. నేను జుయిన్ అయిన తర్వాత పార్టీని నిడదవోలు నియోజవర్గంలో అభివృద్ది చేశాను ఎన్నికల సమయంలో కనీసం నేను ఎమ్మెల్యే టికెట్ కీ అప్లికేషన్ కూడా పెట్టలేదు.. పార్టీ పెద్దలు నా సేవలను గుర్తించి ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరినారు. అందుకు నేను సరే అన్నాను. నన్ను ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పారు’ అంటూ ఎన్నికల నాటి పరిస్థితులను వివరించారు.
అనూహ్యంగా రాత్రికి రాత్రి వేరే వారికి ఇచ్చారని.. తర్వాత పార్టీ పెద్దలు తనను పిలిచి టికెట్ ఎందుకు ఇవ్వలేదో ఎలాంటి కారణాలు చెప్పలేదన్నారు నాని. ఆ కారణంతోనే తాను మనస్థాపం చెంది ఎన్నికల్లో ప్రచారం చేయలేదని.. ఈ నిజం తెలియక కొంతమంది కార్యకర్తలు తన మీద అభియోగాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానినని, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న గ్రూపుల వలన కార్యకర్తలు అయోమయం ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను అందుకు కారణం అవ్వకూడదని పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పంపించినట్లు చెప్పారు. కస్తూరి సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిడదవోలు జనసేన పార్టీలో యాక్టివ్‌గా పనిచేశారు. ఆ తర్వాత గ్రామాల్లోని సమస్యలను జిల్లా కలెక్టర్‌కు తెలియజేడానికి ఛలో ఏలూరు నిర్వహించారు. ఇలా మంచి కార్యక్రమాలు చేపట్టి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేసినా టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాగే, కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటినీ చక్కదిద్ది జనసేన కార్యకర్తలు, నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కస్తూరి నాని కృషి చేశారు.