సుజనా కు షాక్ ...

B Sridhar Yadav

కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పొరేషన్ శాఖ గట్టి షాక్ ఇచ్చింది . సుజనా కు చెందిన 400 కోట్ల విలువైన ఆస్తుల వేలానికి సంబంధించి ఆ శాఖ ఓ  ప్రకటన జారీ చేసింది . హైదరాబాద్ వెంగళరావు నగర్ కు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ సంస్థ తీసుకున్న రుణ బకాయిలను చెల్లించనందుకు ఆ సంస్థ తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పొరేషన్ శాఖ నిర్ణయించింది .

 

రుణానికి జమానతుగా ఉన్న వ్యక్తులకు బ్యాంక్ నోటీసులు జారీ చేసింది . బ్యాంక్ వేలం లో పాల్గొనదల్చిన వారు మార్చి 20 వ తేదీ ఉదయం 11  గంటల నుంచి సాయంత్రం 3 గంటలవరకు ఆస్తులను పరిశీలించవచ్చునని బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పొరేషన్ శాఖ వెల్లడిందించి . సుజనా పలు బ్యాంక్ ల వద్ద రుణాలను తీసుకుని సకాలం లో చెల్లించకపోవడం తో ఆయనపై కేసులను  ఆయా సంస్థలు కూడా నమోదు చేయడం జరిగింది . ఇదే విషయమై ఇప్పటికీ కోర్టులో వివాదం కొనసాగుతోంది . అయితే సుజనా పై కేసుల ప్రభావం తీవ్రం కావడం వల్లే ఆయన టీడీపీ ని వీడి బీజేపీ లో చేరారన్న ప్రచారం జరిగింది . సుజనా, బీజేపీ లో చేరినప్పటికీ  ఆయనకు ప్రయోజనం లేకుండా పోయినట్లు స్పష్టం అవుతోంది .

 

కేంద్రం లో బీజేపీ అధికారం లో ఉండడం తనకు కలిసి వస్తుందని ఆయన భావించినప్పటికీ ,  తమ రుణ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పొరేషన్ శాఖ మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్లాలని  నిర్ణయించుకున్నట్లు తేటతెల్లమవుతోంది  . తన వద్ద సుజనా కు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించడమే, కాకుండా తేదీని కూడా ప్రకటించింది . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: