ఏమయ్యా ఆర్కే...! మరీ ఇంతగా దిగజారిపోవాలా ..? ఛీ ఛీ ఛీ

ఉన్నది లేనట్టుగా... లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో బాగా ఆరితేరిపోయిన మీడియా ... ఆ మీడియా అధిపతులు తమ సొంత అభిప్రాయాలనే ప్రజల అభిప్రాయాలుగా కథనాలను వండి వారుస్తు... రాజకీయ నాయకులను భుజాలకెత్తుకుని మోయడానికి బాగా అలవాటుపడిపోయారు. ఆ బాణీని వదిలించుకోలేక అసమర్ధ, అవినీతి నాయకులను పైకెత్తి మహానుబావులుగా చూపించాలన్న తాపత్రయం లో ఉండిపోతున్నారు. బరితెగించి మరీ సదరు నాయకుల కోసం మీడియాలో కథనాలను వండడం మనడంలేదు. ఇటువంటి చర్యలతో మీడియా అంటేనే ప్రజలకు యావగింపు కలిగేలా చేస్తున్నారు. 


కిట్టూ... బూతు కిట్టు ... కిరాసానాయాల కిట్టు ఇలా సోషల్ మీడియాలో అనేక పేర్లు తగిలించుకున్న ఏబీఎన్, ఆంధ్ర జ్యోతి సంస్థల అధినేత రాధాకృష్ణ వ్యవహారం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తాను బాగా అభిమానించే టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోసం ఎంతగా అయినా దిగజారిపోవడం రాధాకృష్ణ కు బాగా అలవాటు అయిపొయింది అనే విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయినా ఆయనలో మార్పు రాలేదు సరికదా మరింతగా దిగజారి మీడియా విలువలను సైతం దిగజారుస్తున్నాడు అనే చెరుపుకోలేని మరకలు మీద పడుతున్నా మార్పు అయితే ఆయనలో కనిపించకపోవడమే ఆయన మరింతగా విమర్శలపాలవ్వడానికి కారణం అవుతోంది. 


చంద్రబాబు అంటే అభిమానం ఉండడం తప్పు కాదు కానీ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం .. బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ఆయన ఓ మీడియా అధిపతి. కానీ ఆ విలువలు ఏవీ ఆయన పాటించడంలేదు... పాటించే ఉద్దేశంలోనూ కనిపించడంలేదు. ఇక వారం వారం కొత్త పలుకు అంటూ ఆర్కే రాసే ఎడిటోరియల్ నే చూసుకుంటే.. ! అందులో మొత్తం వాస్తవాలను వక్రీకరిస్తూ.. అసత్య పలుకులు పలుకుతూ ఉంటారు. ఈ వారం కూడా అదే విధంగా అదే రకంగా ఆర్కే పిచ్చి రాతలు రాసాడు. 


ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన వద్ద పీఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం తెలిసిందే. ఈ సెంద్రబామా అనేక కీలక డాక్యుమెంట్, నగదు దొరికినట్టుగా ప్రచారం జరిగింది. దీనిపై ఐటీ అధికారులే ప్రెస్ నోట్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.2వేల కోట్లు దారి మ‌ళ్లించిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింద‌ని ఐటీ అధికారులు ప్ర‌క‌టించారు. దీనిపై ఇప్పటివరకు టీడీపీ అధినేత చంద్రబాబే నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండిపోగా ... ఈ వ్యవహారాన్ని మీదేసుకున్న సదరు ఆర్కే ఈ వ్యవహారం నుంచి బాబు పేరు తప్పించేలా జనాల్లోకి అసత్య కథనాలు అల్లుతున్నాడు. 


''అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునేందుకు ఐటీ శాఖ  అధికారులను సంప్రదించగా... విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి. సోదాలు జరిగిన కంపెనీల టర్నోవర్‌ అంతా కలిపి కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఉండదనీ, సబ్‌ కాంట్రాక్టర్ల టర్నోవర్‌ను కూడా కలుపుకొని రెండు వేల కోట్ల రూపాయలు లెక్క చెబుతున్నారనీ ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ నుంచి విడుదల అయిన ప్రకటనలో పేర్కొన్నట్టు రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని రుజువు చేయడానికి తగిన పత్రాలు కూడా లభించలేదని స్పష్టం చేస్తున్నారు’ అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఈ విషయంలో చంద్రబాబు ఆ పార్టీ నాయకులకు లేని బాధనంతా ఒక్క ఆర్కేనే పడిపోతున్నట్టుగా తన కథనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు మీద .. ఆ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలోనే చేరిపోవచ్చు కదా ఇంతగా నొప్పులు పడాల్సిన అవసరం ఎందుకో అంటూ జనాలు, మేధావులు ఆర్కే తీరుపై విమర్శిస్తున్నారు. అయినా ............. మీద వర్షం పడ్డట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: