సుఖసంసారం: వయాగ్రా టాబ్లెట్‌ను ఆ జ్యూస్‌లో కలిపి తీసుకున్నారా... ఇక అంతే సంగతులు!
అందులోనూ ఆరోగ్యం సరిగా లేనివారు ఆల్రెడీ అనారోగ్యంతో కొన్ని ఇబ్బందులు పడుతున్నవారు ఈ వయాగ్రా వాడటం అస్సలు మంచిది కాదంటున్నారు. దానివల్ల మరింత ప్రమాదంలో పడే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు. కాని దేన్ని లేక్కచేయకుండా వయాగ్రాను వారు ఉపయోగించినట్లైతే గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వయాగ్రా ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి, అది కూడా 50ఎంజీకి మించరాదని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల హార్ట్ ఎటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ టాబ్లెట్‌ను శృంగారం చేయడానికి ఒక గంట ముందు వేసుకోవాలి. అప్పుడు దాని యొక్క ప్రభావం తెలుస్తుంది. వయాగ్రా పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. వయాగ్రా ను గ్రేప్ జ్యూస్ లో మాత్రం కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే దాని పనితీరు తగ్గిపోతుంది. ఇక ఈ టాబ్లెట్ వేయడం వల్ల శృంగారం తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం మాత్రం తగ్గడంలేదు. అలాంటప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నవారు నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎప్పటికైనా సరే ఏదైనా మందులు వాడి చేయడం అనేది చాలా ప్రమాదకరం ఏదైనా సరే ప్రకృతి రిత్యా ఉండాలే తప్పించి ఆర్టిఫిషియల్‌గా ఉండకూడదు. దానికి శరీరానికి కావాల్సినంత ఎక్స్‌ర్‌సైజ్‌లు అవి చేయాలి.