అతడు సినిమాలో కోటాశ్రీనివాసరావు, పోసానికి మధ్య ఒక డైలాగ్ ఉంటుంది. అదేమిటంటే ఏం కావాలన్నా ఇప్పుడు ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అన్నట్లు.. ఈ మధ్య హైదరాబాద్‌లో రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుందనే చెప్పాలి. ఈ మధ్యే లైవ్ సెక్స్ పేరుతో హైదరాబాద్‌లో ఒక దందా మొదలయింది. అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు గౌలిగూడకి చెందిన ఒక అమ్మాయిని ప్రేమిచి పెళ్ళి చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉండేవారు.
కొంతకాలం పాటు బాగానే ఉన్నాక సడెన్‌గా ఆ యువతి పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి తనతో సెక్స్ చాట్ చేయాలంటూ కోరాడు. ఫస్ట్ చాట్‌లోనే నాలుగు డబ్బులు కనిపంచడంతో దానిపై ఆశ పుట్టింది ఇక అదే పనిగా దానినే బిజినెస్‌గా మార్చేసుకున్నాడు. కొంత మొత్తం డిపాజిట్ చేయాలంటూ అతగాడు తన గూగుల్ పే ఖాతా నంబర్ ఇచ్చాడు. ఇది నమ్మిన ఎంతో మంది రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించారు.
ఆ తరువాత కొన్ని రోజులు వారితో ఆ యువతి లానే చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ మార్చేవాడు. వేరే ఫోన్ నెంబర్ తీసుకుని మళ్లీ కొత్తగా ఖాతా తెరిచి. మళ్లీ ఎంతో తెలివిగా మరికొంత మందిని ఈ ఊభిలోకి లాగాడు. ఇలా నెల నెలా మారుస్తూ డబ్బులు బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. ప్రతి నెలా తన సెల్‌ఫోన్ నంబర్ మారుస్తూ, కొత్త ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేస్తూ వచ్చాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ దందాని నడిపాడు.
ఇక ఇదిలా సాగుతుండగా సడెన్‌గా అనుకోకుండా ఓసారి యువకుడు కనిపిచకుండా పోయాడు. దాంతో ఆ యువతి ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో అయ్యగారి అసలు బండారం అంతా బయటపడింది. ఇన్‌స్ట్రాగామ్‌లో తన ఫొటో, పేరుతో కొన్ని అకౌంట్లు తెరిచి.. అశ్లీల చాటింగ్స్ చేసి డబ్బు సంపాదించి అదృశ్యమైనట్లు యువతి గుర్తించింది. అంతేకాక వేరే యువతితో తీసుకుని ఉడాయించినట్లు తెలుసుకుంది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
మరింత సమాచారం తెలుసుకోండి: