కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్.. ఇప్పుడు చైనాలో కరోనా విజృంభించేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో మరణించినవారి సంఖ్య 370కు చేరింది. ఇక ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 17 వేలు దాటిపోయింది. అయితే ఇవన్నీ అధికారికంగా వెల్లడించిన లెక్కలే.
ఇక అనధికారికంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందో అన్న ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో థాయ్ లాండ్ డాక్టర్లు ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ కు మందు కనిపెట్టేశారు. దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా. అంతే కాదు.. ఓ ఎనిమిది మందికి జబ్బు పూర్తిగా తగ్గించారు కూడా..
థాయ్ డాక్టర్లు ఆదివారం దీన్ని ధ్రువీకరించారు. బ్యాంగ్ కాక్‌లోని ఇద్దరు డాక్టర్లు దీన్ని సాధించారు. అయితే వీళ్లు కరోనా కోసం చేసిన ప్రయోగం ఫలించింది. సాధారణ ఫ్లూ నివారణకు వాడే యాంటీ వైరస్ డ్రగ్స్ ను ఎయిడ్స్ డ్రగ్స్ కలిపి ఓ కొత్త మందు తయారు చేసి రోగిపై ప్రయోగాత్మకంగా వాడి చూశారు.
అదృష్టవశాత్తూ అది ఫలించింది. చైనా డాక్టర్లు పలుచోట్ల ఎయిడ్స్ మందులనే తాత్కాలిక ఉపశమనంగా ఈ కరోనా వైరస్ రోగులపై వాడుతున్నారు .. వీళ్లు దానికి అదనంగా ఫ్లూ మందులను కూడా కలిపారు. అనూహ్యంగా ఈ కొత్త డ్రగ్ రోగులపై బ్రహ్మాండంగా పని చేయడం ప్రారంభించిందట.
ఈ మందులో రోగుల్లోని ఫ్లూ లక్షణాలు పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చాయట. థాయ్ లాండ్ లోని కరోనా అని నిర్థరించిన 19 కేసుల్లో వీళ్లు ఎనిమిది మందికి జబ్బు నయం చేసి పంపించేశారట కూడా. ఇప్పుడు చైనా వైద్యులు కూడా ఈ చిట్కా వైద్యంపై పరిశోధన ప్రారంభించారట. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాడుతున్న ఈ మందు.. శాస్త్రీయంగానూ రుజువైతే.. కరోనా మహమ్మరి అదుపులోకి వచ్చినట్టే.. వేల ప్రాణాలు గాల్లో కలవకుండా కాపాడినట్టే. చూడాలి ఏం జరుగుతుందో..?
మరింత సమాచారం తెలుసుకోండి: