జగన్ ఎఫెక్ట్: టీడీపీ నుంచి పెద్ద తలకాయ ఔట్?

M N Amaleswara rao

ఏపీ సీఎం జగన్ తీసుకునే ఒక్కో సంచలన నిర్ణయం దెబ్బకు...టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం దెబ్బకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మండలి రద్దు ఎఫెక్ట్‌కు టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. ఇక మూడు రాజధానుల నిర్ణయంతో టీడీపీ కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే మూడు రాజధానులు వల్ల పలువురు టీడీపీ నేతలు కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

 

తాజాగా కూడా ఈ విషయం తేటతెల్లమైంది. జగన్ కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తున్న నేపథ్యంలో, తాజాగా అక్కడకి న్యాయ విభాగానికి చెందిన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుంచీ కర్నూలుకు తరలించాలని జీవో జారీ చేశారు. ఈ జీవో వెలువడిన నేపథ్యంలోనే నందికొట్కూరు మాజీ ఇన్ చార్జ్ విక్టర్ టీడీపీని వీడారు. పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉండటం వలనే పార్టీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.

 

ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ళు నుంచి కర్నూలు టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ కూడా బాబుకు షాక్ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరు పార్టీ మారుతారని ప్రచారం జరిగింది గానీ అలాంటిది ఏమి జరగలేదు. అయితే ఇప్పుడు మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలు న్యాయ రాజధాని కావడం, దీని చంద్రబాబు వ్యతిరేకించడం వల్ల సీమలో టీడీపీకి కష్టాలు వస్తాయని, కాబట్టి పార్టీని వీడటమే బెటర్ అని కే‌ఈ ఫ్యామిలీ ఆలోచన చేస్తుందని అంటున్నారు.

 

పైగా తన కుమారుడు కే‌ఈ శ్యామ్ బాబు, తమ్ముడు కే‌ఈ ప్రభాకర్‌లకు భవిష్యత్ ఉండాలంటే వేరే ఆప్షన్ చూసుకోవడమే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంచెం పరిస్థితులు అటు ఇటు అయితే వీరు టీడీపీని వీడటం ఖాయమని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. మరి చూడాలి కే‌ఈ ఫ్యామిలీ కూడా బాబుకు షాక్ ఇస్తుందేమో?

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: