సైనా నెహ్వాల్ కులం ఏంటో తెలుసా... ఢిల్లీలో ఆ ఓట్ల కోస‌మేనా బీజేపీ స్కెచ్‌...?

హైదరాబాదీ బ్యాట్మెంటన్ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సైనా నెహ్వాల్ ఇప్పుడు రాజకీయాల్లోనూ తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె బిజెపిలో చేరారు. సైనా నెహ్వాల్ తోపాటు ఆమె సోదరి కూడా బీజేపీలో చేరారు. అనంతరం ఆమె పార్టీ అధ్యక్షుడు జేపీ జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ  తాను నిరంతరం కష్టపడే వ్యక్తినని, దేశ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తిని అని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే తత్వంతో పనిచేస్తుండడంతో బీజేపీలో చేరానని ఆమె చెప్పారు. 


 ప్రధాని మోదీతో కలిసి పనిచేయడం గౌరవ సూచకంగా భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఫిబ్రవరి 8 వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సైనా నెహ్వాల్ బిజెపి వ్యూహాత్మకంగా బీజేపీలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత అకస్మాత్తుగా ఆమె ను చేర్చుకోవడం వెనుక సామాజిక సమీకరణాలు లెక్కలు కూడా బిజెపి వేసుకున్నట్లు తెలుస్తోంది. సైనా నెహ్వాల్ సామాజిక వర్గానికి చెందిన జాట్లు (కమ్మ) ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. హర్యానా, ఢిల్లీ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఆధిపత్యం వీళ్లదేఎక్కువగా ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, దేవీలాల్ మొదలైన వారంతా ఇదే కులానికి చెందినవారు. ఢిల్లీ రాజకీయాల్లో ఎక్కువగా వీరి ప్రభావం కనిపిస్తుంది.


 ఈ నేపథ్యంలోనే బిజెపి ఆ వర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని సైనానెహ్వాల్ ను ఢిల్లీ ఎన్నికలకు ముందే బిజెపిలో చేర్చుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఢిల్లీలో క్రేజీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ దోసుకుపోతుండడంతో బీజేపీ లో ఆందోళన ఎక్కువయ్యింది.ఎలా అయినా ఆ పార్టీ గెలవకుండా చేసేందుకు బీజేపీ  రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. దానిలో భాగంగానే ఆమెను బీజేపీలోకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులోనూ సైనా నెహ్వాల్ కు బీజేపీలో కీలక పదవులు కూడా దక్కే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: