హెరాల్డ్ సెటైర్ :  ఆయన గురించి చెప్తా ... రాస్కోరా సాంబా !

ఏరా సాంబా నేను ఆయన గురించి చెప్తా అన్నాను కదా ! ఏం చెప్పమంటావ్ రా ? ఆయనకో తిక్కుంది దానికి లెక్కుంది అని చెప్పమంటావా ?. ఆయన సినిమాల్లో సూపర్ పవర్ స్టార్ అని చెప్పమంటావా ?, లేక పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్పమంటావా ?, అసలు ఆయన గురించి చెప్పడానికి ఏముందో చెప్పారా నాకు. ఆయన అన్నగారు ప్రజలను పాలించడానికి ఒక పార్టీ పెడితే, ప్రచారానికి వెళ్లిన ఆయన, ప్రజలకు ఏమి చేస్తామో చెప్పకుండా వాళ్ల పంచెలు ఊడదీస్తా... ఈళ్ళ ప్యాంట్లు ఊడదీస్తా అంటూ అప్పుడు తెగ హడావుడి చేసేసి రభస రభస చేసేశాడని చెప్పమంటావా ? 


ఆయన అన్న గారు కుర్చీలో కూర్చునే అంత స్థాయిలో సీట్లు తెచ్చుకోలేక, పార్టీని నడపలేక ఇంకో పార్టీలో కలిపేస్తే నేను ఆ పార్టీని నడిపిస్తా అంటూ ముందుకి రాకుండా సినిమాలు చేసుకుని ఎప్పటికో ఇంకో పార్టీ పెట్టాడని చెప్పమంటావా ? పోనీ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసాడని చెప్పమంటావా ? వాళ్ళకి వీళ్ళకి మద్దతు ఇస్తున్నాను, గెలిపిస్తే వారు సక్రమంగా పనిచేయకపోతే నేనే ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశ్నగా మిగిలిపోయాడని చెప్పమంటావా ? 


ఆయన భజన చేసిన పార్టీ గెలిచిన తరువాత ప్రజలను ఏడిపిస్తే ఈ ప్రశ్నిస్తానన్న నాయకుడు ఎక్కడో బొబ్బున్నాడని చెప్పనంటావా ? ప్రశ్నిస్తాని చెప్పింది అధికార పార్టీని కాదు ప్రతిపక్షాన్ని అన్నట్టుగా ఆయన వ్యవహారం పసుపు పార్టీలో సా....గిందని చెప్పమంటావా ? ఆళ్లు ఈయన గారిని తెగ వాడేసుకుని పక్కన పడేసినా ఇంకా వారి చుట్టూనే తిరుగుతున్నాడని చెప్పమంటావా ? సొంత పార్టీని పట్టించుకోవడం మానేసి ఆళ్లూ ఈళ్ళ బజానాలోనే ఇంకా ఉండిపోతున్నాడని చెప్పమంటావా ? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఓ యువ సీఎం వచ్చీ రాగానే ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తుంటే అడ్డం పడుతున్నాడని చెప్పమంటావా ?


 ఆఖరికి సొంత పార్టీలో గెలిచిన ఆ ఒకే ఒక్క ఎమ్యెల్యే కూడా ఈయన్ని పట్టించుకోకుండా ఆ యువ సీఎం కి పాలతో అభిషేకాలు చేసేస్తూ పొగిడేస్తుంటే మనసులోనే కుమిలిపోతూ పైకి నవ్వుతున్నాడని చెప్పమంటావా ? భ్రమరావతి అంటూ గత పెబుత్వం గ్రాఫిక్స్ లో బొమ్మలు సూపిస్తే చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టాడని చెప్పమంటావా ? ఇప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే మళ్లీ అడ్డం పడుతున్నడని చెప్పమంటావా ? అంతెందుకు ఆయనకు పార్ట్ టైం పొలిటిషిన్ అనే బిరుదు వచ్చినా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పమంటావా ?


 రెండు రోజుల పోరాటం నెల రోజుల విరామం అన్నట్టుగా ఆయన ఉంటున్నా ఆయన పార్టీ వాళ్ళు కూడా నోరు మెదపలేకపోవడానికి ఓ లెక్క ఉందని చెప్పమంటావా ? అసలు ఏమి చెప్పమంటావు రా సాంబా ? సరి సర్లే ఆయన గురించి ఇప్పుడు చెప్తా రాస్కోరా సాంబా ! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: