అమరావతిలో మరో రైతు ప్రాణం పోయింది..?

praveen

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజదానుల  ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతిలో తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలోని రైతులందరూ తీవ్రస్థాయిలో ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడో రాజధానుల  ప్రకటన చేయగానే రాజధాని రైతుల గుండెల్లో బాంబు పేలినట్లు అయింది. దీంతో జగన్ నిర్ణయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు తాము మూడు పంటలు పండించుకునే భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుండి తరలిస్తామని అంటే  తమకు అన్యాయం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  అమరావతి రైతులు. 

 

 ఈ నేపథ్యంలో అమరావతిలో పరిస్థితి మాత్రం రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. రైతులే కాకుండా రైతు కుటుంబీకులు మొత్తం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుండటంతో  పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అంతేకాకుండా జగన్ నిర్ణయం తర్వాత తీవ్ర మనస్థాపం చెందిన ఎంతో మంది రైతులు సైతం మరణిస్తున్నారు. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో మల్లికార్జున రావు అనే రైతు మృతి చెందటం సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు తాజాగా మరో రైతు ప్రాణాలు విడిచాడు. 

 

 రాజధాని ప్రాంతం లోని వెంకటపాలెంలో  ఓ రైతు కూలీ మరణించాడు. వెంకటేశ్వరరావు అనే రైతు కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశ్వరరావు ప్రతిరోజు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులందరూ చేస్తున్న ఆందోళనల్లో  పాల్గొంటున్నాడని గ్రామస్తులు తెలిపారు. జగన్ రాజధాని మార్పు నిర్ణయం ప్రకటించాక తీవ్ర మనోవేదన తోనే రైతు వెంకటేశ్వరరావు మృతిచెందాడని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా  రైతులు ధర్నాలను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు నిరసనలు ధర్నాలు ఆగవని తేల్చి చెప్పారు అమరావతి రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: