జగన్ పథకం ఓ ప్రాణం తీసింది..?

praveen

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విషాదం చోటుచేసుకుంది. జగన్ ప్రవేశపెట్టిన వై.ఎస్.ఆర్ నేతన్న  నేస్తం పథకం అర్హులైన వారిలో  తనకు పేరు లేదని  మనస్తాపం చెంది నేతన్న  ఆత్మహత్య చేసుకున్నాడు. తన పేరు పథకంలో అర్హుల జాబితాలో లేదని ఇక తనకు పథకం లబ్ధి చేకూరుతుందని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు చేనేత కార్మికుడు. అనంతపురం జిల్లా సోమందేపల్లి లో చోటుచేసుకుంది ఈ విషాదం. నర్సింలు అనే చేనేత కార్మికుడు తన పేరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న  నేస్తం పథకం లో లేదని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తనకు చేయూత  లభించదు అని భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనను  టిడిపి కార్యకర్త గా భావించి తన పేరును అధికారులు నేతన్న  నేస్తం పథకానికి అర్హుల జాబితాలో చేర్చలేదని  ఆవేదనకు లోనై  ఆత్మహత్య చేసుకున్నాడు చేనేత కార్మికుడు. 

 

 

 చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న నర్సింహులుకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ధర్మవరంలో ఉంటూ మగ్గం  పని చేస్తూ  జీవనం సాగిస్తున్నది  ఈ కుటుంబం. కాగా ఇంటి పెద్దను  కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడినట్లయింది.  ఇప్పటికైనా నేతన్న  నేస్తం అర్హుల జాబితాలో తమ  పేరు చేర్చాలని నర్సింలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 పుట్టినరోజు సందర్భంగా వైయస్సార్ నేతన్న  నేస్తం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటనలో భాగంగా జగన్ ఈ పథకానికి ఊపిరి పోశారు. 

 


 గత ప్రభుత్వ హయాంలో నేతన్నలను  పట్టించుకోలేదని తమ ప్రభుత్వం వచ్చాక నేతన్నలకు చేయూతనిచ్చేందుకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం  పథకాన్ని ప్రవేశపెడుతున్నామని  జగన్ తెలిపారు. భారీ బహిరంగ సభలో నేతన్న నేస్తం  పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 24 వేల రూపాయలు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కాగా  అనంతపురం జిల్లాలోని 27, 481 మంది  వైఎస్ఆర్ నేత నేస్తం పథకానికి అర్హులుగా ఎంపికయ్యారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది  చేనేత  కార్మికులంతా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: