న్యూ ఇయర్ వేడుకలుః న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంత ఈజీ కాదండోయ్...?
వేడుకల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి.
వేడుకలు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
డీజేకు అనుమతి లేదు, 45 డెసిబెల్స్ మ్యూజిక్ శబ్దం మించకూడదు.
డ్రగ్స్, మత్తు పదార్థాలు విక్రయించవద్దు.
ట్రాఫిక్ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. వేడుకల్లో అశ్లీలం ఉండవద్దు.
మైనర్లకు ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో మద్యం సరఫరా చేయొద్దు.
వేడుకల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు తాగొద్దు.
మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపొద్దు.
క్యాబ్, ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్ 100, లేదా హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.
వేడుకల ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరమని సూచిక బోర్డులు పెట్టాలి.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే వాహనం సీజ్, 10 వేల జరిమానా.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నం. 850-041-1111 కు సమాచారం ఇవ్వాలి.
అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం. 949-061-7111, సైబరాబాద్ వాట్సాప్ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి. విజన్ 2020లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం చేస్తే శిక్ష ఖాయం దిశగా దర్యా ప్తు, విచారణ ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.