ఎదిగే కొద్దీ ఒదిగుండడం నేర్చుకుంటున్న జగన్ !
పెద్దలు జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెబుతూ ఉంటారు. ఈ సామెతను జగన్ బాగా వంటబట్టించుకున్నారు. గడచిన దశాబ్ద కాలంలో జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ కు ముక్కు మీద కోపం ఎక్కువని ఎవరు చెప్పినా వినడని తను చెప్పిందే అందరూ వినాలనే మనస్వతం ఉన్నవాడిని టీడీపీ నాయకులు ఆరోపణలు చేసేవారు.
కానీ జగన్ రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుండి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు హద్దులు దాటి విమర్శలు చేశారు. కానీ జగన్ ఎప్పుడూ తన మాటల్లో సహనం కోల్పోలేదు. హద్దులు దాటి విమర్శలు చేయలేదు. ఒకప్పుడు తనపై విమర్శలు చేసిన నేతలే వైసీపీ పార్టీలో చేరతామని కోరినా జగన్ అభ్యంతరం తెలపలేదు. అందరినీ కలుపుకుంటూ తగిన గౌరవం ఇస్తూ ఉన్నత శిఖరాలను జగన్ అధిరోహిస్తున్నారు.
జగన్ గురించి తెలిసిన వారు జగన్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటున్నాడని ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మారాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఒక సభలో జగన్ మాట్లాడుతూ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని తన తండ్రి తనకు చెప్పారని అన్నారు. అలా ఒదిగి ఉంటే మాత్రమే జీవితంలో మరింత పైకి ఎదుగుతామని చెప్పారు. ఒకప్పుడు తన తన తండ్రి చెప్పిన మాటలే తాను ఈ స్థితిలో ఉండటానికి కారణమని అన్నారు.
రాజకీయరంగంలో సత్తా చాటుతున్న జగన్ ఎదిగిన కొద్ది ఒదుగుతూ అణుకువతో మెలుగుతూ విజయాలను సాధిస్తున్నారు. జగన్ ఎదిగే కొద్దీ ఒదుగుతున్నాడని సీఎం స్థానంలో ఉన్నా కించిత్ గర్వం లేదని జగన్ ను దగ్గర నుండి చూసిన సీనియర్ రాజకీయనేతలే పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎదిగిన కొద్దీ తాను ఒదిగి ఉండటం మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపించాలని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలని ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని సూచనలు చేస్తుంటారని సమాచారం.