దశాబ్ది కాలంలో శతాబ్ది నాయకుడిగా జగన్మోహనుడి విజయ గమనం !

Reddy P Rajasekhar

దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు కష్టాలను అనుభవించారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మాత్రం ఎవరూ కష్టాలను అనుభవించలేదు. సాధారణ వ్యక్తిలా జైలు జీవితం అనుభవించిన జగన్ తన కష్టార్జితంతో వైసీపీ పార్టీని స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతో కష్టపడి, కఠిన పరీక్షలను ఎదుర్కొని 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించేంతలా కష్టపడ్డారు జగన్. 
 
గడచిన దశాబ్ద కాలంలో సీఎం జగన్ పడిన కష్టం, పోరాడిన తీరు, అంతిమంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ గురించి మరో వందేళ్ల పాటు మాట్లాడుకునే స్థాయికి సీఎం జగన్ ఎదిగారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సోనియా గాంధీను కోరినా సోనియా గాంధీ అందుకు అంగీకరించలేదు. జగన్ ఆ తరువాత పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీని స్థాపించారు. 
 
ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి కేసులు వేయించడం, సీబీఐ విచారణ, జగన్ అరెస్ట్ మొదలైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ జగన్ పై సీబీఐని ప్రయోగించి పదహారు నెలల పాటు జగన్ ను జైలులో ఉండేలా చేసింది. విభజన పరిణామాల వలన 2014 సంవత్సరంలో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో జగన్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొని వైసీపీ పార్టీని బలహీనపరచాలని అనుకుంది. 
 
ఆ తరువాత పాదయాత్రలో ప్రజలతో మమేకమై నవరత్నాలను ప్రకటించి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజా సంక్షేమ పాలన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఆరు నెలల్లో ఏపీలో ఎన్నో సంచలన నిర్ణయాలను అమలు చేసి, అవినీతిని పూర్తిగా అంతం చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ప్రజల మెప్పును పొందారు జగన్. జగన్ గురించి, జగన్ కష్టాలు పడి ముఖ్యమంత్రిగా విజయం సాధించటం గురించి మరో వందేళ్ల తరువాత కూడా ప్రజలు చెప్పుకుంటారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: