జగన్‌ పై  ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు..

Suma Kallamadi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలలో త్రీవ గందరగోళాన్ని సృష్టించడానికి దారి తీసిస్తూ ఉన్నాయి అని టీడీపీ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తమకు కు మద్దతు పలికారు కానీ. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారని ప్రశ్నించారు. చాలా మంది మూడు రాజధానులు ఏమిటి ఇంతవరకూ ఎక్కడా కూడా లేవు కదా అని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు.

 

మాటలు చెప్పడం గొప్ప పని కాదని, సరికాదని.. చెప్పారు.ఎన్నికల ముందు జగన్‌ చెప్పిన మాటలన్నీయు అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే అని తెలిపారు. తర్వాత ఇప్పుడు పాటిస్తున్నది వేరు పద్ధతి. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు అక్రమంగా భూములు కొన్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపణ చేయడము జరిగినది. ఒకవేళ అలా భూములు ఉంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. టీడీపీ నేతల్ని చూపిస్తూ.. రైతుల్ని నానారకాలుగా  ఇబ్బంది పెడుతున్నారన్నారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు.

 

రాజధాని విషయంలో ఎందుకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణాఫ్రికాతో పోల్చి ఏపీ ప్రజల్ని అవమాన వస్తున్నారని అన్నారు నరేంద్ర. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా జగన్ చేయడం బాగా లేదన్నారు... దేశంలో ఏ రాష్ట్రానికి మల్టిపుల్‌ కేపిటల్స్ లేవని కూడా గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేశారని చెప్పారు.హైకోర్టు అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు వివాదం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. జగన్ నిర్ణయాలు తెలంగాణకు ఒక వరంలా మారాయన్నారు జగను మాటల వల్ల ధూళిపాళ్ల. లులు, అదానీ, సింగపూర్‌ సంస్థలు తెలంగాణకు వెళ్లిపోవడం జరిగింది అని అన్నారు. మన రాష్ట్రములో స్థాపించ వలసిన పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోవడం ఎంత బాధాకరమో అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: