మూడు రాజధానులపై స్పందించిన మాజీ మంత్రి
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని జగన్ వాక్యలు చాల కలకలం రేగిందని అర్థం అవుతుంది. ఇకపోతే అసలు విషయానికి వస్తే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ గా, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతిగా ఉంచాలి అని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ మూడు రాజధానుల అంశం ప్రస్తావించారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
జగన్ ప్రకటన వెనుక అసలు పెద్ద కుంభకోణం దాగి ఉందంటూ టీడీపీ సీనియర్ నేత, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఈ సందర్బంగా ఆరోపించారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ, వైసీపీ నేతలు ఆరు వేల ఎకరాల భూములు కొన్నారని ఉమా అయన తెలిపారు.
విశాఖపట్నం నగర సమీపంలోని మధువాడ, భోగాపురం ఎయిర్ పోర్టు పరిసరాల్లో వేల ఎకరాలు కొనుగోలు చేశారని విశాఖపట్నంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాజధానిపై ఒక్కమాట మాట్లాడని జగన్, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడు నెలల్లో భూములు పెద్ద ఎత్తున చేతులు మారాయని ఆయన తెలిపారు.
విశాఖపట్నం భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి ఉమా డిమాండ్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటన్నింటినీ సీబీఐకి అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. భోగాపురం చుట్టుపక్కల వైసీపీ నేతలు వేల ఎకరాలు కొనడం జరిగిందని, అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఉమా, సీఎం జగన్ తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని అయన ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.