సీఎం జగన్ పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్.. సిగ్గులేదా అంటూ..
సినీ పరిశ్రమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టి సంచలనాలకు తెర తీసిన శ్రీరెడ్డి పేరు తెలియని వారుండరు. సినీ పెద్దల చరిత్రలను బజారుకు ఈడ్చమే కాకుండా ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఒంటిమీద ఉన్న దుస్తులు విప్పుకోని రచ్చ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి పవన్ కల్యాణ్ స్పందించడం లేదని ఆయనపైనా విరుచుకుపడింది. ఇలా సినీ, రాజకీయ ప్రముఖులు తనతో రాసలీలలు సాగించాలని అందరి పరువు తీసింది. తాజాగా ఏపీ సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసింది.
తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా శ్రీ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేసింది. చెన్నై లో ఉంటున్న శ్రీరెడ్డి ఏపీ రాజకీయాల్లో తలదూర్చి నానా హంగామా చేసింది. జైజగన్ అంటూ జగన్ కు జై కొట్టిన శ్రీ రెడ్డి జగన్ పాలనను ఆకాశానికి ఎత్తింది. జగన్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చింది. జగన్ విజన్ ఉన్న నాయకుడు అని, జగన్ పాలనలో తండ్రిని మించిపోయారని కితాబిచ్చింది. జగన్ మంచి వ్యక్తి అని, మంచి వ్యక్తి ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయని, జగన్ పాలన చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, జగన్ పాలనపై కామెంట్స్ చేయడానికి సిగ్గులేదా అని ప్రశ్నించింది.
జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని శ్రీ రెడ్డి చెప్తున్నది. జగన్ ను ఆకాశానికి ఎత్తిన శ్రీ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను నానా మాటలు అన్నది. నిజంగా అవి మాటలు కాదు. బూతులు. అవి వినడానికే దారుణంగా ఉన్నాయి. వాటిని అక్షరాలా రూపంలో రాయాలి అంటే చాలా కష్టమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే వాటిని రాయడం చాలా కష్టం.
పవన్ కళ్యాణ్ అంటే శ్రీ రెడ్డికి ఎందుకంత కోపం అన్నది ఇప్పటి వరకు తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఒంటి కాలుమీద లేస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి వరసపెట్టి తిట్లపురాణం చేస్తున్నది. కానీ, పవన్ మాత్రం ఇవేమి పట్టించుకోకపోవడం విశేషం.