తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నీ అక్రమ నిర్మాణాలే:  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి

Suma Kallamadi

తెలుగుదేశము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ పారంబోకు భూములు కనపడితే అక్కడ ఏదో ఒక ఆఫీసు పెట్టి అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగింది. అలాగే మంగళగిరి మండలంలోని ఆత్మకూరులో ఏమాత్రము నియమ నిబంధనలు పాటించకుండా. చట్ట విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇలా పార్టీ కార్యాలయాలను నిర్మించడం చాలా తప్పు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి తెలిపారు. నూతనంగా నిర్మించిన టీడీపీ పార్టీ కార్యాలయం ఉండే ప్రదేశాన్ని,స్థలాన్ని వాగులకు, పోరంబోకు భూములకు కేటాయించినట్లు తెలిపారు. 

 

ఇలా  ‘వాగులకు, చెరువులకు పోరంబోకు భూములను ఆఫీసులకు, పార్టీ కార్యాలయాలకు ఎటువంటి పరిస్థితులలో కూడా కేటాయించ కూడదని మన యొక్క చట్టాలు చెబుతున్నాయి. అయినా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం చట్టవిరుద్ధ ము అని తెలిపారు . ఈ విషయంపై తాను కోర్టును ఈ విషయంపై తాను కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందన్నారు. దీనిపై కోర్టు నోటీసులు కూడా కూడా ఇవ్వడము జరిగిందని తెలిపారు.

 

చివరకు చంద్రబాబు నాయుడు ఉండే నివాసము కూడా అక్రమమేనని, ఇ‍ప్పుడు ఆయన కట్టుకున్న పార్టీ కార్యాలయం కూడా అక్రమంగానే నిర్మించారని విమర్శించారు. ఆయన కట్టిన వన్నీ అక్రమము గానే ఉన్నాయి. అయితే ఈ పార్టీ కార్యాలయాన్ని లింగమనేని రమేష్‌ కట్టించారు., దీని కోసం​ మొదట 3.65 సెంట్ల భూమిని టీడీపీ ప్రభుత్వమే స్వతహాగా కేటాయించుకుందని తెలిపారు. అది కాకుండా పార్టీ కార్యాలయం కోసం ఉమా మహేశ్వర్‌రెడ్డి అనే రైతు  యొక్క భూమిని కబ్జా చేయడము జరిగిందన్నారు . కబ్జా చేసిన భూమిపై ఆ రైతు కోర్టును ఆశ్రయించారు. తర్వాత కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను కూడా ఏ మాత్రము చంద్రబాబునాయుడు పాటించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం సరికాదు అని ఆయన తెలిపారు. ఎంతైనా రైతుల భూములను కబ్జా చేయడం ఎంత అన్యాయమో అని బాగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: