సభలో `ఉన్మాద` దుమారం.. టార్గెట్ అయిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన మౌనంగా ఉండి.. విమర్శలు చేస్తున్నా.. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ప్రారంబమైన నేపథ్యంలో ఆయన పైచేయి సాదించాలనే ఉద్దేశంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మనిషే కాకుండా మాటల విషయం లోనూ ఆయన అదుపుతున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. గురువారం నాటి సభ ప్రారంభంలో ఆయన ప్లకార్డులు పట్టుకుని, చొక్కాకు నల్ల రిబ్బన్లు పెట్టుకుని రావడం సంచలనం సృష్టించింది.
ఈ క్రమంలోనే ఆయనను అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. బాబుతోపాటు ఆయన పరివారాన్ని కూడా గేటు వద్ద నిలిపేశారు. ఈ సందర్భంగా మార్షల్స్ చర్యను ప్రతిఘటించిన చంద్రబాబు అనూహ్యంగా నోరు జారారు. ముఖ్యమం త్రి ఉన్నాదిగా ఉన్నాడు కాబట్టి మీరు(మార్షల్స్) కూడా ఉన్నాదంతో వ్యవహరిస్తారా? మమ్మల్ని అడ్డుకుం టారా ? అంటూ ఆయన మాటల తూటాలు పేల్చారు. అయితే, ఈ వ్యాఖ్యలు వికటించాయి. తర్వాత గురు వారం, శుక్రవారం నాటి సభల్లో కూడా బాబు చేసిన ఉన్మాద వ్యాఖ్యలపై తీవ్ర గందరగోళం నెలకొంది.
ముఖ్యంగా అధికార పక్షం ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి మేం నేర్చు కునేది ఇదేనా? అంటూ జూనియర్ శాసన సభ్యులు కూడా బాబును టార్గెట్ చేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు బోనులో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలను ఖండించనూ లేదు. వెనక్కి తీసుకోనూ లేదు. దీంతో వివాదం మరింత ముదిరి తొలి రెండు న్నర గంటల సభాసమయం వృధా అయిందనే చెప్పాలి. ఇక, ఈ ఘటనలు, వ్యాఖ్యలపై స్పీకర్ సీతారాం కూడా సీరి యస్ అయ్యారు. ఆ ఘటనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కాని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సభ నుంచే ఆయన డీజీపీని ఆదేశించారు.
ఈ పరిణామం చంద్రబాబుపై తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాధార ణంగా ఆయన ఆగ్రహానికి గురి కావడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, అతికి పోవడమే ఇప్పుడు కొత్త చిక్కలు తెచ్చింది. అదేసమయంలో ఈ మొత్తం ఘటనను సభనైతిక నియమావళి, ప్రవర్తనావళి కమిటీకి రిఫర్ చేశారు. ఈ పర్యవసానం మున్ముందు బాబుకు ఇబ్బంది కలిగిస్తుందనే అంటున్నారు పరిశీలకులు.