పార్లమెంటులో రాహుల్ తీరుపై మండిపడ్డ బీజేపీ పార్టీ
ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో బాగా ఫైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అత్యాచార ఘటనలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు రేపిస్టులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని బీజేపీ విమర్శించడం జరిగింది. దీనితో రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేయడం జరిగింది. ఇలా డిమాండ్ చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది.
ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు కొనసాగడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ‘ ఇది మేకిన్ ఇండియా కాదు. రేపి ఇన్ ఇండియా’ అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఓ యువతిపై అత్యాచారం జరిపిన కూడా .. ఆయన స్పందించడం లేదు అని విమర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా కేంద్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ వ్యాఖ్యలను లోక్‌సభలో ప్రస్తావించడం జరిగింది. ‘ఇలా భారత మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటూ ఓ నాయకుడు పిలుపునివ్వడం చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. వాస్తవానికి తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి అని అనుకుంటారు అని ప్రశించడం జరిగింది. ఇలా చేయడంతో ఆయనను శిక్షించాల్సిందే, రాహుల్ క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేయడం జరిగింది.
మరు వైపు మరో బీజేపీ ఎమ్మెల్యే లోకేత్ ఛటర్జీ మాట్లాడుతూ... ‘పరిశ్రమల అభివృద్ధికై ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంటే రాహుల్‌జీ మాత్రం రేపిన్ ఇండియా అని అంటున్నారు అని తెలిపారు. ఇలా మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలను ఆయన ప్రోత్సహిస్తున్నారా?? అని రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంలో రాహుల్ మాట్లాడుతూ నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అని పార్లమెంట్ బయట మాట్లాడాం జరిగింది.