అమలు కానీ సీఎం కేసీఆర్ హామీ

Suma Kallamadi

తెలంగాణ ఆర్టీసి కార్మికుల సమ్మె సమయంలో కొంత మంది ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి అందరికి  తెలిసిందే కదా. అయితే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలలో ఒకరికి వారి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం జరిగింది. చాలా మంది ఆర్టీసి కార్మికుల పిల్లలు బీటెక్, ఎంటెక్ లు పూర్తి చేయడం జరిగింది. దీంతో వారి అర్హతకు తగ్గట్టుగా అడ్మినిస్ట్రేటివ్ వైపు ఉద్యోగాలు వస్తాయని వారంతా బాగా అసలు పెట్టుకున్నారు. కానీ అలా జరగకుండా ఇష్టమున్నట్టు ఉద్యోగాలిచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో నాలుగు కేటగిరిల్లో మాత్రమే పోస్టులు ఉన్నాయి. దాంతో వాళ్ళు కోరుకున్న జాబ్స్  వారి రాలేదు అనే బాధలో ఉన్నారు.


 
వరంగల్‍ రీజియన్‍ పరిధిలో నలుగురు కార్మికులు చని పోవడం జరిగింది. హన్మకొండ డిపోలో కండక్టర్‍ గా పనిచేస్తున్న ఏరుకొండ రవీందర్‍, మహబూబాబాద్‍ డిపోలో పనిచేసే డ్రైవర్‍ ఆవుల నరేష్‍, నర్సంపేట డిపో డ్రైవర్‍ యాకుబ్‍ పాషాతో పాటు తొర్రూర్‍ డిపోలో కండక్టర్‍ ఎం.వీ.పాపయ్య చనిపోయారు. డ్రైవర్  ఆవుల నరేష్‍ కుమారుడు శ్రీకాంత్‍ బీటెక్‍చదివాడు. యాకుబ్‍పాషా కొడుకు ఫయాజ్‍ ఎంబీఏ, కండక్టర్‍ పాపయ్య కూతురు ఆమని బీటెక్‍, ఏరుకొండ రవీందర్‍ కుమారై ప్రవళిక డిగ్రీ పూర్తి చేశారు. 

 

విద్యార్హతల ప్రకారం జాబ్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా అందుకు ఒప్పుకోలేదని ఏరుకొండ రవీందర్ కుమార్తె ప్రవళిక వాపోయింది. అందుకే తాను సెక్యూరిటి గార్డు ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఎంబీఏ చేసిన యాకుబ్ పాషా కొడుకు ఫయాజ్ కండక్టర్ పోస్టును ఎంపిక చేసుకోవాల్సి పరిస్థితి  వచ్చింది.  అన్ని డిపోల పరిధిలోను నియామకాలలో ఇలాంటి అన్యాయమే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరడం జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: