వచ్చే జూన్‌ నుంచే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇన్ ఇండియా

Suma Kallamadi

ఒక చోటి నుంచి మరియొక చోటికి అంటే ఒక రాష్ట్రం నుంచి మరి ఒక రాష్ట్రానికి జీవనాధారం కోసం వలస పోవడం జరుగుతున్నది. ఈ వలస పోయిన కార్మికులకు, దినసరి పనిచేసుకునే కూలీలకు ప్రయోజనకర ముగా ఉండాలని ప్రభుత్వము సూచించడం జరుగుతుంది. ఈ పథకంగా భావిస్తున్న ‘వన్‌ నేషన్, వన్‌ రేషన్‌ కార్డ్‌’ పథకం వచ్చే జూన్‌ నుంచి మొత్తము దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

 

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగినటు వంటి లబ్ధిదారులు ఈ రేషన్‌ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం (ఎఫ్‌పీఎస్‌) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. బయోమెట్రిక్‌ మిషన్ లేదా ఆధార్‌ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలియచేయడం జరిగింది. ఈ కాలంలో  తాము జీవిస్తున్న పల్లెలలో సరైన పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు‘. ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. సరియైన సమయంలో వర్షాలు లేక పంటలు పండటం కష్టతరం అవుతుంది. 

 

అటువంటి సమయములోఉపాధి కోసంవేరే రాష్ట్రాలకు నగరాలకు పట్టణాలకు వలస పోతున్నారు. అటువంటప్పుడు వారికి ఉన్న రేషన్ ను సక్రమంగా వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించి కేంద్ర ప్రభుత్వము  దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది’అని ఆయన చెప్పారు.

ఈ పథకము అమలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఉదాహరణకు బెంగళూరు సిటీ లో ఒక కేజీ బియ్యం కొనాలన్నా కనీసం 60 రూపాయలు వెచ్చించి వస్తున్నది. అదే మనకు రేషన్ కార్డు మీద అయితే కిలో ఒక్క రూపాయి చొప్పున చాలా ప్రయోజనం కలుగుతుంది. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ‘వన్‌ నేషన్‌ వన్‌ స్టాండర్డ్‌’పై కృషి చేస్తుంది అని తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: