కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎయిర్టెల్... కాల్డా,డేటా చార్జీలు ఇకనుంచి అందనంత దూరంలో.?

praveen

దేశంలో టెలికాం రంగసంస్థల్లో   ఎక్కువ కస్టమర్లను కలిగి ఉన్న సంస్థ ఎయిర్టెల్. అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందించడంతో పాటు ఎంతోమంది నూతన కస్టమర్లను ఆకర్షిస్తూ సరికొత్త ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ మంది ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఒకప్పుడు సరికొత్త ఆఫర్లతో తక్కువ చార్జీలతో ఎక్కువగా వినియోగదారులను ఆకర్షిస్తు తమ నెట్ వర్క్  వైపు తిప్పుకునే టెలికాం రంగ సంస్థలు...  ఇప్పుడు మాత్రం టెలికాం రంగ సంస్థలు సరికొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటించి వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్  ప్రకటిస్తే వినియోగదారులు సంబర పడాలి కానీ ఎందుకు బెంబేలెత్తి పోతున్నారు అంటారా... కొత్త టారిఫ్ ప్లాన్ లు ప్రకటిస్తున్నాయి  కానీ వాటిని భారీగా ధరలు పెంచి  ప్రకటిస్తున్నాయి టెలికాం రంగ సంస్థలు. 

 

 

 

 ఇప్పటికే టెలికాం రంగ దిగ్గజం అయిన వోడాఫోన్ ఐడియా సంస్థ కూడా భారీగా టారిఫ్ ఛార్జీలను పెంచుతూ వినియోగదారులందరికీ షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో అతి తక్కువ ధరకే సేవలను అందిస్తున్నామని అందుకే టారిఫ్  ఛార్జీలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది . ఇప్పుడు తాజాగా అటు ఎయిర్టెల్ వినియోగదారులకు కూడా భారీ షాక్ ఇచ్చింది. టారిఫ్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాల్ డాటా చార్జీలను భారీగా పెంచింది.  అయితే ఈ నిబంధనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 

 

 

 

 కాగా  పాత ధరలతో పోలిస్తే 42 శాతం మేర కాల్ డాటా చార్జీలు పెరగనున్నాయి. వివిధ టారిఫ్  ప్లాన్ లలో  రోజుకి 50 పైసల నుంచి 2.85 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకు తగ్గట్టుగానే కాల్ డేటా లాభాలు కూడా ఉంటాయని ఎయిర్టెల్ సంస్థ తెలిపింది. ఎయిర్టెల్ థాంక్స్ ప్లాట్ఫాం వేదికగా ఎయిర్టెల్ కస్టమర్ లకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ కూడా అందిస్తామంటూ ఎయిర్టెల్ టెలికాం రంగ సంస్థ తెలిపింది. ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్  లో పదివేల సినిమాలు, టీవీ షోలు 400 చానల్ సహా వింక్ మ్యూజిక్ లాంటివి కూడా అందిస్తామని తెలిపారు. ఎయిర్టెల్ కొత్త నిబంధనలతో వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: