ప్రియాంక రెడ్డిని ఏ టైం లో హత్య చేసి తగలబెట్టారో తెలుసా.?
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా ఈ దారుణ ఘటనకు పాల్పడిన వారిలో మహమ్మద్ ఆరిఫ్, జోళ్ళు శివ, జోలు నవీన్, చింతగుంట చెన్నకేశవులు లారీ డ్రైవర్లు కాగా మిగతా ఇద్దరు క్లినర్లు కూడా ఉన్నారు. వీరందరూ తెలంగాణతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో లారీల ద్వారా మెటీరియల్ తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి టోల్ ప్లాజా వద్ద కు వీరందరూ చేరుకోగా లారీని ఎక్కడ అన్లోడ్ చేయాలన్నదానిపై అవతలి పార్టీ నుంచి ఇంకా కాల్ రాకపోవడంతో టోల్ ప్లాజా సమీపంలోనే వాహనాన్ని నిలిపి ఉంచారు . కాగా సాయంత్రం 6 గంటల సమయంలో ప్రియాంక రెడ్డి అక్కడ తన స్కూటీని పార్క్ చేయడం చూశారని అప్పటికే నిందితులు అందరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
అయితే ప్రియాంక రెడ్డి తన స్కూటీని అక్కడే పార్క్ చేసి ఓ ట్రీట్మెంట్ కోసం గచ్చిబౌలి వెళ్లిందని... కాగా ప్రియాంక రెడ్డి మళ్ళీ అక్కడికి వస్తుందని అంచనా వేసి ఒక కిరాతక ఆలోచనకు వచ్చి ఓ ప్లాన్ కు అందరూ తెరలేపారు అంటూ పోలీసులు తెలిపారు. దీంతో పథకం ప్రకారమే నవీన్ అనే యువకుడు ప్రియాంక రెడ్డి స్కూటి యొక్క వెనక టైరు గాలి తీసేశాడని ... ఇక ప్రియాంకా రెడ్డి అక్కడికి చేరుకోవడంతో మీ టైర్ పంచర్ అయింది మీకు సాయం చేస్తామంటూ చెప్పడంతో నిజమని ప్రియాంక రెడ్డి నమ్మిందని తెలిపారు. కాగా ఆ స్కూటీని తీసుకెళ్లిన శివ అనే యువకుడు కాసేపటి తర్వాత వచ్చి షాపు మూసేసి ఉంది అని చెప్పి మరో షాక్ కు తీసుకుని గాలి కొట్టించుకొని వచ్చాడు. ఇంతలో ప్రియాంకను మిగితావాళ్లూ లారీల చాటుకు లాక్కెళ్లాడు. కాగా ప్రియాంకను లారీల చాటుకు లాక్కెల్లిన మహ్మద్ ఆరిఫ్ కు మిగతా వాళ్ళు కూడా సహకరించారు.
ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో ప్రియాంక రెడ్డి అరుపులు వినిపించకుండా ఆమె నోరును గట్టిగా నొక్కేశారు.దీంతో ఊపిరాడక ప్రియాంక అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకుని ప్రియాంక మృతదేహాన్ని ఓ దుప్పట్లో చుట్టేసి షాద్ నగర్ వద్ద పెట్రోలు పోసి తగలబెట్టారు నిందితులు. ప్రియాంక రెడ్డి స్కూటీని మార్గమధ్యంలో పడేసారు . ఆ తర్వాత మహమ్మద్ ఆరిఫ్ లారీ తో సహా వెళ్లి అందులోని లోడుని అన్లోడ్ చేసి ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు అని పోలీసుల విచారణలో తేలింది. ప్రియాంక రెడ్డి ని రాత్రి 10 గంటల 30 నిమిషాలకు నిందితులు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా ప్రియాంక రెడ్డి మృతదేహం తెల్లవారుజామున రెండు గంటల 30 నిమిషాలకు పెట్రోల్ పోసి తగల పెట్టినట్లు పోలీసులు తెలిపారు . కాగా హత్య చేసిన ప్రాంతానికి తగలబెట్టిన ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరం ఉందని పోలీసులు తెలిపారు.