పారదర్శకంగా  నవశకం సర్వే నిర్వహించాలని సీఎం జగన్  ఆదేశాలు..

Suma Kallamadi

వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ హయాంలో నవశకం సర్వేలో గుర్తించిన ప్రయోజనము చేకూర్చే లబ్ధిదారుల జాబితాలను డిసెంబర్ నెల 15 నుంచి 18 వరకు, ఎంపిక చేశాక తుది జాబితాలను డిసెంబరు 20నాటికి అన్ని గ్రామ సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను కోరడం జరిగింది.

 

తాజాగా స్పందన కార్యక్రమంలో ఒక భాగంగా  ముఖ్యమంత్రి గారు సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ప్రత్యేకంగా ఒక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వైఎస్‌ఆర్‌ నవశకం అమలు తీరుపై సమీక్షించారు. అందుబాటులో ఉన్న సచివాలయ కేంద్రాలలో 52 కేంద్రాల్లో వచ్చే 3 నుంచి వారానికి రెండు దఫాలుగా వికలాంగులకు సదరం ధ్రువపత్రాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. 

 

  ఇసుక లభ్యతపై ప్రతిజిల్లా స్థాయిలో ప్రతి వారం పత్రికల, ద్వారా , మీడియా ద్వారా,ప్రజ లందరూ సమాచారం తెలుసుకునే విధముగా ఏర్పాట్లు చేయాలిఅని చెప్పారు. ఇప్పటినుంచిఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న ప్రతి వాహనానికి డిసెంబరు 10 నాటికి జీపీఎస్‌ తప్పనిసరి చెయ్యాలని చెప్పారు జిపీఎస్ లేకపోతే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. 439 చెక్‌పోస్టులలో రాత్రిపూటా దృశ్యాలను నిక్షిప్తం చేసే నైట్‌విజన్‌ కెమెరాలను ఏర్పాటు చేయడంపై వచ్చే నెల 10 నాటికి సిద్ధం చేయవలెను ఆదేశించారు. 

 

 అనేక రకాల  సంక్షేమ పథకాలకు సంబంధించి జనవరి 1 నుంచి కొత్త కార్డుల ముద్రణ, పంపిణీ కార్యక్రమము మొదలుకావాలి. వ్యాధులపై పేదలకు నెలకు రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద అందించే సాయం కోసం లబ్ధిదారుల జాబితాల రూపకల్పనపై కలెక్టర్లు ప్రత్యేకశ్రద్ధ చూపాలి అని పేర్కొన్నారు. 

 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: