బాలీవుడ్ సినిమాను తలదన్నేలా రియల్ స్టోరీ.. క్లైమాక్స్ వేరు..!!

Balachander

నిజజీవితంలో జరిగే సంఘటనల ఆధారంగానే దాదాపుగా సినిమాలు తీస్తుంటారు.  ఎక్కడో కొన్ని తప్పించి చాలా వరకు సినిమా స్టోరీలు ఇలానే ఉంటాయి.  ప్రజా జీవితంలోనుంచి పుట్టుకొని వస్తుంటాయి.  అందులో సందేహం అవసరం లేదు.  ప్రజా జీవితంలో అద్బుతం అని తెలుసుకున్న కొన్ని కథలను రంగరించి వాటికి కాస్త మసాలా దట్టించి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి చివరకు కథను బయటకు తీస్తారు.  
ఆ కథలోని గొప్పదనాన్ని ప్రజల ముందు తెరపై ఆవిష్కరిస్తారు.  అయితే, ఒక్కోసారి తెరపై జరిగిన సంఘటనలు నిజజీవితంలో జరుగుతుంటాయి.  అలాంటి వాటిని చూసి షాక్ కావడం తప్పించి మరేం చేయలేము.  కొన్ని జీవితాలు సినిమా లైఫ్ ను తలపించే విధంగా ఉంటాయి.  క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది.  ఏడేళ్ల క్రితం బాలీవుడ్ లో హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా గుర్తుంది కదా.. అందులో సల్మాన్ ఖాన్.. ఐష్ లు ప్రేమికులు.  
ఎంతగా ప్రేమించుకుంటారు అంటే పీకలలోతుగా ప్రేమించుకుంటారు.  కానీ, అనుకోని విధంగా అజయ్ దేవగణ్ తో వివాహం జరుగుతుంది.  ప్రేమించిన అమ్మాయి దూరమైనా సరే ఆమెనే ఆరాధిస్తూ.. ఆమె కోసమే జీవిస్తూ ఉంటాడు.  ఆ తరువాత విషయం అజయ్ కు తెలుస్తుంది.  ఇద్దర్ని కలపాలని అనుకుంటాడు.  కానీ క్లైమాక్స్ కు వచ్చే సరికి అతనితో ఉండేందుకు ఆమె ఒప్పుకోదు.  భర్త దగ్గరే ఉండలని కోరుకుంటుంది.  
ఇదే కథ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటు చేసుకుంది. భోపాల్ నగరంలో ఓ ఇద్దరు భార్యాభర్తలు.  ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.  హ్యాపీగా ఉంటున్నారు.  కానీ ఆమెలో ఎదో తెలియని వెలితి కనిపించింది.  అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెలోని వెలితికి కారణం ఏంటి అని ఆరాతీస్తే.. ఆమె ప్రేమించిన వ్యక్తి అని తేలింది.  ఆమెను ఆరాదీస్తూ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు.  అది ఆమె భర్త మనసును కదిలించింది.  పరస్పర అంగీకారంతో ఆమె భర్త విడాకులు ఇచ్చేందుకు అంగీకరించాడు.  ఇద్దరు పిల్లల్ని తన వద్దే ఉంచుకున్నాడు.  పిల్లల్ని చూడాలి అనిపించినపుడు తప్పకుండా వచ్చి చూడొచ్చని చెప్పాడు.  ఇది బాలీవుడ్ సినిమా స్టోరీలా లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: