ఏపీ రాజధాని నడిబొడ్డున ట్రెండ్ గా మారిన మహిళల పేకాట... పోలీసుల దాడి తో వెలుగులోకి అసలు నిజాలు
సాధారణంగా అయితే పురుషులు ఎక్కువగా పేకాట ఆడుతున్నారు. పేకాట మత్తులో పడి మొత్తం లోకాన్ని మర్చిపోతుంటారు పురుషులు. పేకాట ఆడుతూ మనకి అటు కుటుంబాలు ఉన్నాయా లేవా అని కూడా పట్టించుకోకుండా సర్వం అక్కడే ధారపోస్తారు. రోజుల తరబడి ఒకే దగ్గర కూర్చుని కూడా పేకాట ఆడేవాళ్లు చాలామంది ఉంటారు. పేకాట ఆడుతున్న వాళ్ళు దేన్నైనా బేరం పెట్టేందుకు కూడా వెనకాడరు పేకాట రాయుళ్లు. ఇక పేకాట జీవితంలో సర్వం కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉంటారు. కాగా పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు జరిగినప్పటికీ కూడా వారు మాత్రం వేరే స్థావరాలను ఏర్పర్చుకుంటుని పురుషులు పేకాట ఆడుతూ ఉంటారు. అటు కుటుంబీకులు లబోదిబోమంటున్న కూడా పట్టించుకోకుండా పేకాట ఆడతారు . అంతేకాదు ఈ పేకాట ఓ వ్యసనంగా మారిపోయింది ఆడకపోతే పిచ్చివాళ్ళు కూడా అవుతుంటారు పురుషులు . కానీ మహిళలు పేకాట ఆడడం చాలా తక్కువగా చూస్తుంటాం.
ఒకవేళ చూసినా అది సినిమాల్లోను లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మాత్రమే చూస్తూ ఉంటాం . కానీ ఇక్కడ రాజధాని నడిబొడ్డున మహిళలు పేకాట ఆడుతున్నారు. అంతేకాదండోయ్ ఇక్కడ చాలామంది మహిళలు ఒక్కచోట చేరి పేకాట దుకాణం మొదలెట్టేసాడు. ప్రస్తుతం రాజధాని నడిబొడ్డున సాగుతున్న మహిళల పేకాట ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఏపీ రాజధాని అమరావతిలోని నడిబొడ్డున. ఏపీ రాజధాని అమరావతిలో నడిబొడ్డున మహిళలు పేకాట ఆడడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇది అక్కడ ఒక ట్రెండ్ గా మారిపోయింది. తాడేపల్లి పట్టణం రామ్ హాస్పిటల్ సమీపంలో ఎంతోమంది మహిళలు ఒకదగ్గర చేరి పేకాట ఆడుతున్నారు.
అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మహిళలు రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై దాడులు చేశారు. రాజధాని నడిబొడ్డున లోని ఓ ఇంట్లో మహిళలందరూ ఒక్కచోట చేరి పేకాట ఆడుతున్నట్లు కనిపించడంతో అటు పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు. ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు వారి వద్ద నుంచి 1, 36,000 నగదు పాటు 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే పోలీసులు పేకాట స్థావరాలకు చేరుకున్నది గమనించి మరో ముగ్గురు పేకాట ఆడుతున్న మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే పేకాట స్థావరాలపై పట్టుబడిన మహిళలను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఏపీ రాజధాని ప్రాంతంలో మహిళలలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.