‘లాంగ్ మార్చ్’ కార్యక్రమం ద్వారా సరైన బుద్ధి చెబుతాం అంటున్న నాగబాబు..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు మూడు నెలల ముందు జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీచేసిన నాగబాబు దారుణంగా ఓడిపోవడం జరిగింది. దీంతో ఒకపక్క టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తూనే మరోపక్క రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ ఏపీలో ప్రజా సమస్యలపై పోరాడటానికి ఆరాటపడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ వేసిన అడుగుజాడల్లో నడుస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక విధానం లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పోరాడటానికి ఆదివారం విశాఖలో జరుగుతున్న లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నడుంబిగించారు మెగా బ్రదర్ నాగబాబు.


ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా కనిపిస్తూ ఎక్కువగా టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను అలరిస్తున్న నాగబాబు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి అన్ని విధాల ప్రజల మద్దతు కూడగట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో హాజరైన నాగబాబు మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.


అంతేకాకుండా లాంగ్ మార్చ్ ర్యాలీ విషయంలో అధికార పార్టీ నేతలు మధ్యలో కలుగజేసుకొని ఇష్టమొచ్చినట్లు పొగరుగా మాట్లాడుతారని, కానీ అలా పొగరుగా మాట్లాడితే వారికి సరైన సమాధానం చెప్పే దమ్ము మా జనసేన నేతలకు ఉందని నాగబాబు స్పష్టం చేశారు. లాంగ్ మార్చ్ కార్యక్రమములో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఖచ్చితంగా ర్యాలీ విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు నాగబాబు. దీంతో నాగబాబు ఇచ్చిన పిలుపుకు మెగా అభిమానులు కచ్చితంగా ఇసుక విధానం లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించాలని లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: