
నాగార్జున వర్శిటీ వీసీ.. 400 తప్పులు చేశారా..?
నాగార్జున యూనివర్శిటీలో వీసీ దామోదరనాయుడు అరెస్టు కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన మురళికృష్ణను కులం పేరుతో దూషించిన ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వీసీ దామోదర్‌నాయుడును పోలీసులు అరెస్టు చేయడం వర్శిటీలో చర్చనీయాంశమైంది. ఆయన ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.
అయితే దామోదరనాయుడిని కాపాడేందుకు టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏకంగా గవర్నర్ ను కలవడంపై వైయస్‌ఆర్‌సీపీ మండిపడుతోంది. దామోదరనాయుడు అక్రమాలను ఎండగడుతోంది. ఎవరైనా గవర్నర్‌ను కలవొచ్చు అని, కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ, దళిత చట్టాలను అవహేళన చేస్తూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేసిన నాయకులు వైయస్ జగన్ పాలనపై నిందలు వేయడం దారుణమని వైసీపీ నేతలు అంటున్నారు.
వైయస్ జగన్ నిర్ణయాలతో పేదలకు మేలు జరుగుతుంటే గవర్నర్‌పై ఎవరిపై ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. చిలుకలూరిపేటకు చెందిన ఉయ్యూరు మురళి కృష్ణ అనే వ్యక్తి ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరారని, అక్కడ ఉన్న వీసీ దామోదర్‌నాయుడు అతన్ని కులం పేరుతో దూషించి అవమానపరిచారని వైసీపీ అంటోంది. కులం పేరుతో తిట్టి అవహేళన చేస్తే కేసులు పెట్టరా అని వైసీపీ నిలదీస్తోంది. దామోదర్ నాయుడు అనే వ్యక్తి దళితుడిని అవహేళన చేస్తే కేసు పెట్టారు. మీకు దళితులంటే తెలియదా? ఎవరిని రక్షిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
400కు పైగా తప్పులు చేసిన దామోదర్ నాయుడి తరఫున గవర్నర్‌ను కలుస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఎంతమంది దళితులను మీరు అవహేళన చేశారో గుర్తు లేదా అని మండిపడ్డారు.