రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలో కడప జిల్లా ఒకటి. ఈ జిల్లాలోని భూముల్లో ఐరన్ ఎక్కువగా ఉన్నది. గతంలో దీనికి వెలికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నా.. కొన్ని కారణాల వలన ఆ మైనింగ్ ను ప్రస్తుతం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జిల్లాకు రాష్ట్ర రాజకీయాలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ జిల్లా నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ జిల్లా నుంచి వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
ఇంతట ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాలో గతంలో ఫ్యాక్షనిజం కూడా ఎక్కువుగా ఉండేది. అయితే, ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ లేదు.. ఓన్లీ డెవలప్మెంట్ యాక్షన్ మాత్రమే ఉన్నది. అయితే, ఇప్పుడు ఈ జిల్లాను కొన్ని పరిస్థితులు కుదిపేస్తున్నాయి. భయపెడుతున్నాయి.. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతున్నదో అర్ధంగాక ప్రజలు భయపడుతున్నారు.
అధికారులు సైతం ఏమి చెప్పలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా భయం.. అనుకుంటున్నారు కదా.. అక్కడికే వస్తున్నా.. కడపజిల్లాలో బుగ్గ అగ్రహారం పేరు వినే ఉంటారు. రెండేళ్ల క్రితం ఈ పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆ బుగ్గ అగ్రహారంలో ఉన్నట్టుండి పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ ఏర్పడిన ఆ గోతులను చూసి ప్రజలు భయపడ్డారు. భూమి ఉన్నట్టుండి లోపలి కుంచించుపోయి గోతులుఏర్పడటాన్ని చూసి భయపడ్డారు.
ఎందుకు అలా జరుగుతుందో ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటె అదే జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలంలోని గూడవాండ్ల పల్లె గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలంలో దాదాపు భూమి 8 అడుగుల లోపలి కూరుకుపోయింది. దీంతో అక్కడ కూడా భయాందోళనలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం బుగ్గ అగ్రహారంలో జరిగితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. ఎందుకు ఆలా జరిగిందో అర్ధం కావడం లేదు. కొంతమంది భూమిలో ఏలియన్స్ ఉన్నాయని అవి భూమిని లోనికి లాగేసుకుంటున్నాయని పుకార్లు పుట్టిస్తున్నారు. అసలు భయపడుతున్న ప్రజలకు ఇది మరింత భయాన్ని కలిగిస్తోంది.