100 రోజులు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం జగన్ పాలనపై అన్ని వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఒక వైపు వినిపిస్తున్నాయి. అదేసమయంలో మేధావులు కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ రెండు విమర్శల్లోనూ విభేదాలు, వివాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ కోణంలో ఆలోచించే వారికి ఆ కోణంలోనే జగన్‌పై విమర్శలు కనిపిస్తున్నాయి. కానీ, ప్రజా కోణంలో చూస్తున్నవారికి పాజిటివ్ కోణం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా.. రాష్ట్రంలో జగన్ పాలన విషయంలో మిశ్రమ అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
తాజాగా నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతం గా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు తమ మనసులోని మాటలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నా రు.ఈ క్రమంలోనే జగన్ పాలనపైనా తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. జగన్ పాలన బాగానే ఉందనే వారు 89% మంది ఉండడం గమనార్హం. అయితే, మొదట్లో కొంచెం గందరగోళం ఉన్నప్పటికీ.. పోను పోను జగన్ పాలన బాగానే ఉందని చెబుతున్నారు.
గతంలో ఏదైనా విషయంపై విమర్శలు రాగానే చంద్రబాబు హడావుడి పడిపోయేవారని, వెంటనే ఆయన అనకూల మీడియా కూడా హడావుడి చేసేంద ని, కానీ దీనికి విరుద్ధంగా జగన్ ఆచితూచి స్పందిస్తున్నారని అంటున్నారు. ఇక, ప్రభుత్వ పథకాల విషయంలోనూ ఖచ్చితత్వం పాటిస్తున్నారని చెబుతున్నారు. రాజకీయ విమర్శల ను పక్కన పెడితే.. మిగిలిన విషయాల్లో జగన్ అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయని అంటున్నారు. ఏ విషయంలోనూ దుందుడుకు వ్యవహారాలు చేయడం లేదని చెబుతున్నారు.
అన్నా క్యాంటీన్ల ను మూసివేసిన తర్వాత వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయాన్ని ప్రచారం చేసుకోకుండా అంతర్గతంగానే కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారని, ప్రచారానికి దూరంగా పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఈ తరహా పాలన చేయడం చాలా తక్కువ మందికి మాత్రమే చేతనవుతుందని కొనియాడుతుండడం గమనార్హం.