మోడీతో బాబుకు దోస్తీ కుదిరినట్టేనా..? ఈ సంకేతం అదేనా..?

Chakravarthi Kalyan

చంద్రబాబు మళ్లీ తన పాత స్నేహితుడు బీజేపీతో జట్టుకట్టబోతున్నాడా.. ? వెంటాడుతున్న కేసులు, రాజకీయ వైఫల్యాల నేపథ్యంలో మోడీ వద్దకు రాజీ బేరానికి అంగీకరించాడా..? ఓవైపు పార్టీ అంతర్థానమయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బలవంతపు దోస్తీకి సిద్ధమయ్యాడా..?


ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన పరిణామం ఒకటి నిలుస్తోంది. చంద్రబాబు సర్కారు హయాంలోని అవినీతిని వెలికి తీసేందుకు ఇటీవల జగన్ కొన్ని కమిటీలు వేసిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో పవర్ పర్చేజ్ ఒప్పందాలను రద్దు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం లేఖ రాసింది. అసలు కేంద్ర మంత్రి ఇలాంటి లేఖలు రాయవలసిన అవసరం ఏమి వచ్చిందన్నది అర్థం కాని ప్రశ్న. ఇదంతా చంద్రబాబును కాపాడేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తుగడగా కొందరు అనుమానిస్తున్నారు.


రాష్ట్రం సలహా అడగక ముందే... ఒప్పందాలపై ఇంకా సమీక్ష చేస్తున్న తరుణంలోనే ఇలా కేంద్రం రాసిందంటే ఎవరో కేంద్ర మంత్రిని ప్రభావితం చేసి ఉండాలని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట కాబట్టి ఈ లేఖ వెనుక ఆయనే ఉన్నారన్నది వారి వాదన. కేంద్రంతో చంద్రబాబు రాజీ కుదుర్చుకున్నందువల్లే ఇలాంటి లేఖ వచ్చిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: