అల్లు అర్జున్ తన జాన్ జిగిడి త్రివిక్రమ్ ను పట్టించుకోకపోవడానికి మెయిన్ కారణం ఇదేనా..?
ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, త్రివిక్రమ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను లోకేష్ కనగరాజ్‌కు అప్పగించాడు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఇండస్ట్రీలో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకంటే త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌కు ఉన్న బంధం అంత సాధారణమైనది కాదు.జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు అల్లు అర్జున్ కెరీర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో తిరుగులేని ఇమేజ్ను తీసుకొచ్చింది.
అలాంటి దర్శకుడిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోట వినిపిస్తోంది. ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న వన్ అండ్ ఓన్లీ కారణం ఏమిటంటే – పాన్ ఇండియా ట్యాగ్.త్రివిక్రమ్ ఎంత మంచి కథలు రాసినా, ఎంత క్లాస్ సినిమాలు తీసినా, ఇప్పటివరకు ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రాలేదన్న మాట వినిపిస్తోంది. ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పూర్తిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. నార్త్ ఇండియా మార్కెట్లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఈ స్థాయిలో ఉన్న హీరో తన తదుపరి సినిమాల విషయంలో మరింత స్ట్రాటజిక్‌గా ఆలోచిస్తున్నాడట. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకులతో సినిమాలు చేయాలన్న ఆలోచనలోనే అల్లు అర్జున్ ఉన్నాడని టాక్. అందుకే లోకేష్ కనగరాజ్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.అయితే, దీని అర్థం త్రివిక్రమ్‌తో పూర్తిగా బంధం తెంచుకున్నాడని కాదు అని కొందరు అంటున్నారు. టైమింగ్, మార్కెట్ అవసరాలు, కెరీర్ ప్లానింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు మారితే మళ్లీ ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా, ప్రస్తుతం మాత్రం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ ఇద్దరి కాంబినేషన్‌ను మరోసారి పెద్ద తెరపై చూడాలని ఆశ పడుతున్నారు. ఈ గ్యాప్ తాత్కాలికమా..? లేక నిజంగానే కెరీర్ మలుపులో తీసుకున్న కీలక నిర్ణయమా..? అన్నది కాలమే చెప్పాలి.