దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గాని... నేడు ఏపీ సీఎం.జగన్మోహన్‌రెడ్డి గాని ఆ రెండు పత్రికలు చదవమంటే చదవమని... ఎవ్వరూ చదవద్దని ఓపెన్‌గానే చెప్పేవారు. ఇలా ముక్కుసూటిగా చెప్పడం ఈ ఇద్దరికే చెల్లింది. అప్పుడు కాంగ్రెస్‌కు ఓ మీడియా ఉండాలనే సాక్షి పత్రిక, ఛానెల్ పెట్టారు. ఇక జగన్, వైసీపీపై ఐదేళ్ల పాటు పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతితో పాటు ఏబీఎన్ ఛానెల్ ఎంత దుష్ప్రచారం చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈనాడు కూడా టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నా ఆ పత్రిక మరీ బరితెగించదన్న అభిప్రాయం ఉంది. ఆంధ్రజ్యోతి మాత్రం టీడీపీ, చంద్రబాబు కోసం బట్టలిప్పుకుని మరీ కొరడాతో కొట్టేసుకుంటుందన్న గుసగుసలు మీడియా, రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎన్నికలకు ముందు జగన్ ఆ రెండు పత్రికలు అన్నా ఈనాడు కంటే జ్యోతిపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నది కూడా తెలిసిందే. ఇక జ్యోతి ఐదేళ్ల టీడీపీ పాలనలో చాలా అక్రమాలు చేసింది.
అందుకే ఇప్పుడిప్పుడే ఈ సంస్థ ఆఫీసులకు ప్రభుత్వం నోటీసులు కూడా ఇస్తోంది. ఈ పత్రిక విలేకర్లు చేసిన అక్రమాలు, దందాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రిగా జ్యోతి పత్రికను అస్సలు ఫాలో అవ్వడం లేదని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే తాజాగా బయటకొచ్చిన జగన్ ఆఫీసులోని టేబుల్ మీద ఉన్న పత్రికల్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.
సీనియర్ నేత దాడి వీరభద్రరావు జగన్‌ను భేటీ అయ్యారు. ఈ క్రమంలో తీసిన ఫొటోలో జగన్ టేబుల్ మీద పెద్ద ఎత్తున దినపత్రికలు ఉన్నాయి. వాటిల్లో అగ్ర పత్రికలు మొదలుకొని పెద్దగా పరిచయం లేని దినపత్రికలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. తాను ఏ మాత్రం ఇష్టపడని ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రం లేదు. దీనిని బట్టి జగన్ జ్యోతి పత్రిక మొఖం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్‌పై ఇటీవల జ్యోతి పత్రిక వార్తలు కాస్త మారినట్టు కూడా టాక్.