షాకింగ్ : జగన్ పై చేతబడి ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై చేతబడి జరుగుతోందా... ఈ అనుమానం ఎవరిదో కాదు... సాక్షాత్తు జగన్ సన్నిహితుడు గా చెప్పుకొనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ది. అవును.. ఆయన తన అనుమానాన్ని ట్విట్టర్ వేదికగా బయటపెట్టారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. టిడిపి నేతల విమర్శలకు ఎప్పటికప్పుడు ఘాటుగా సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ వైయస్ జగన్ పరిపాలన విధానం పై ట్విట్టర్ లో ఓ కామెంట్ పెట్టారు.
దేవినేని ఉమ తన కామెంట్లో రాజకీయ విమర్శలు చేయడంతో పాటు.. విధి చాలా క్రూరమైంది అంటూ... కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ పై విజయసాయిరెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. దేవినేని ఉమా.. విధి క్రూరమైంది అంటూ కామెంట్ పెట్టావు.. చేతబడి కానీ మొదలు పెట్టావా ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చారు.
అక్కడితో ఆగితే ఆయన విజయసాయిరెడ్డి ఎందుకు అవుతారు... ఆయన ఇంకా ఏమని కామెంట్ పెట్టారంటే... " మీ అన్న రమణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.. మీ వదిన ది సహజ మరణం కాదు అంటారు.. దుర్మార్గాల తో ఈ స్థాయికి వచ్చావంటే విధి ఎంత దయ లేని దో అర్థం కావడం లేదూ అంటూ కామెంట్ చేశారు.