ఎడిటోరియల్ : చంద్రబాబు నివాసం అనుమతుల్లో పెద్ద ట్విస్టు ?

Vijaya

కరకట్టపైన చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ నిర్మాణం కీలక మలుపు తిరిగింది. అది అక్రమనిర్మాణం కాదని ముమ్మాటికి సక్రమ నిర్మాణమే అంటూ టిడిపి నేతలు వాదిస్తున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయడు మాట్లాడుతూ గెస్ట్ హౌస్ నిర్మించేందుకు పంచాయితి ఆఫీసు నుండి 2007లో తీసుకున్న అనుమతిని చూపించారు.

 

అలాగే భవనంలో ఇతర నిర్మాణాలు అంటే స్విమ్మింగ్ పూల్ లాంటి నిర్మాణాలకు రివర్ కన్సర్వేషన్ విభాగం నుండి కూడా అనుమతులు తీసుకున్న కాగితాలను చూపారు. అందుకు లింగమనేని చెల్లించిన రూ. 18 లక్షల నాలా పన్నును రశీదులను కూడా చూపారు. అంటే అచ్చెన్న తన చేతిలో కొన్ని కాగితాలను పట్టుకుని భవనం నిర్మాణానికి అన్నీ అనుమతులు ఉన్నాయని చెప్పారు.

 

తన చేతిలో కాగితాలను పట్టుకున్నారే కానీ అవేవీ మీడియా చేతికి ఇవ్వలేదు. అయితే భవనం యజమాని అన్నీ అనుమతులు తీసుకునే భవనం నిర్మించినట్లు పదే పదే చెప్పటం విచిత్రంగా ఉంది. ఈ విషయాన్ని పక్కనపెడితే ప్రభుత్వం గుర్తించిన ఇతర అక్రమనిర్మాణాలకు కూల్చివేత నోటీసులు ఇవ్వాలని అనుకున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

 

ఏ భవనంకు నోటీసు ఇవ్వాలని వెళ్ళినా భవనం నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులను భవనం యజమానులు చూపుతున్నారు. పంచాయితీ ఇచ్చిందా, మున్సిపాలిటి ఇచ్చిందా లేకపోతే విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి ఇచ్చిందా ? అన్న విషయాన్ని అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. ఏదేమైనా మొత్తానికి అక్రమనిర్మాణల కూల్చివేత అంశంలో తాజా ట్విస్టు మొదలైనట్లే.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: