చంద్రబాబులో కుప్పం టెన్షన్..?

Chakravarthi Kalyan
కుప్పం.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం. ఇక్కడ ఆయన వరుసగా ఎనిమిది సార్లుగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన ప్రచారానికి రాకపోయినా మంచి గెలిపిస్తారన్నది ఆయన నమ్మకం.. కానీ ఈ సారి ఆ నమ్మకం తగ్గింది. చంద్రబాబు మెజారిటీ గతంలో పోలిస్తే చాలా వరకూ తగ్గింది. 


ఒకనాటి 80, 90 వేల మెజారిటీ ఇప్పుడు ముక్కుతూ మూలుగుతూ 30 వేలకు పడిపోయింది. దీంతో చంద్రబాబుకు కుప్పం టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో ఈసారి తనకు మెజార్టీ తగ్గడంపై చంద్రబాబు నాయుడు బాదపడ్డారట. కుప్పం టిడిపి నేతలతో ఆయన ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. 

కుప్పంలో గతంలో తనకు 70వేల మెజార్టీ రాగా, ఈసారి 30వేలే వచ్చిందని నేతలతో చంద్రబాబు అన్నారు. తన నియోజకవర్గంలో ఆధిక్యం ఎందుకు తగ్గిందో కారణాలను కనుక్కోవాలని  చెప్పారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకు నీళ్లు తెచ్చినా ఓట్లు ఎందుకు పడలేదని నేతలను అడిగారు. 

ఈ నెలాఖరులో తాను కుప్పంలో పర్యటించనున్నట్టు తెలిపారు. తెలుగుదేశం నేతలంతా గతం మరిచి భవిష్యత్తు వైపు నడవాలని, మనలో ఉన్న చిన్నచిన్న లోపాలను సవరించుకోవాలని చంద్రబాబు వారితో అన్నారు. మరి చంద్రబాబు కుప్పంలో మెజారీటీ పెంచుకునేందుకు ఇప్పటి నుంచే ప్లానులు వేస్తున్నారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: