స్పిరిట్ సినిమా విషయంలో పక్కా ప్లాన్ తో డైరెక్టర్..!

Divya
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం స్పిరిట్. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా ప్రభాస్ డేట్స్ కాస్త అడ్జస్ట్ కావడం లేదని టాక్ ఇప్పుడు వినిపించడంతో అసలు స్పిరిట్ సినిమా 2027 మార్చి 5న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు అభిమానులలో మొదలవుతున్నాయి.


అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పక్క ప్లాన్ తోనే షూట్ చేస్తున్నారని వచ్చే సెప్టెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల పైన ఫోకస్ చేసేలా ప్లాన్ చేశారు. అలా రిలీజ్ డేట్ అనుకున్న సమయానికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ప్రభాస్ సినిమాలు ఈ మధ్యకాలంలో కాస్త డీలే అవుతున్నప్పటికీ, కానీ స్పిరిట్ విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం గానే ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.


సందీప్ రెడ్డి వంగా గత చిత్రాల విషయానికి వస్తే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలలో  ఉండే ఎమోషన్స్ వైలెన్స్ స్పిరిట్ సినిమాలో అంతకుమించి ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ మేకింగ్ స్టైల్ నుంచి టెక్నికల్ వాల్యూస్ వరకు కూడా సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసేలా ఈ సినిమా ఉండబోతొందట. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.ఇందులో వివేక్ ఓబేరాయ్ ప్రతి నాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే కల్కి 2, సలార్ 2, ఫౌజీ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: