ఎడిటోరియల్ : ఇసుక మాఫియాకు జగన్ ఊహించని షాక్

Vijaya

చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తెచ్చిన వ్యవహారాల్లో ఇసుక మాఫియా కూడా కీలకమైనదే. అటు ఇసుక మాఫియాను వేళ్ళతో సహా పెకిలించి వేయాలని జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయించారు. చంద్రబాబునాయుడు హయాంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియాను సమూలంగా దెబ్బ కొట్టాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది.

 

ప్రకృతి ప్రసాదించిన ఇసుకను సామాన్యులకు అందకుండా చేయటంతో చంద్రబాబుపై సామాన్య జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. అదే సమయంలో యంత్రాంగం అదుపు లేకపోవటంతో టిడిపి ప్రజాప్రతినిధులు ఇసుకను అమ్మేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు.

 

అంటే ప్రజా ప్రతినిధుల సంపాదనా మార్గాలు చంద్రబాబుకు తెలియకుండా ఏమీ జరగలేదు. అంతా చంద్రబాబుకు తెలిసే జరిగింది. అందుకే జనాలకు ప్రజాప్రతినిధులతో పాటు చంద్రబాబు మీద కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. ఇళ్ళు కట్టుకోవటానికి సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా నానా అవస్తలు పడుతున్నారు.

 

అందుకనే మాఫియాను పూర్తిగా నియంత్రించాలని నిర్ణయించారు. ఇసుక ఉచితం అన్న పద్దతిని ఎత్తేసి ఎంతో కొంత ధరను నిర్ణయించాలని అనుకున్నారు. పర్యవేక్షణ మొత్తాన్ని గనుల శాఖ ఆధీనంలో ఉంచనున్నారు. రీచులను యూనిట్లుగా గుర్తించి అవసరమైన వాళ్ళందరికీ తక్కువ ధరల్లో గనులశాఖే ఇసుకను అందించేట్లు నిర్ణయించారు.

 

చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా రెచ్చిపోయినట్లు స్వయంగా తోక పత్రికే ఇపుడు చెబుతోంది. అలాగే  జగన్ తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వానికి, జనాలకు మంచి జరుగుతుందని చెప్పటం విశేషం.  తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇసుక మాఫియా బాధలు తప్పుతుంది. జనాలకు తక్కువ ధరలకే ఇసుక దొరుకుతుంది. మూడు విధాల లాభం కాబట్టే జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పచ్చ పత్రిక చెబుతోంది.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: