స్టాలిన్ కు షాక్! బీజేపీ విజయం తధ్యం: డీఎంకే బిజేపితో పొత్తు కు సై : తమిళ సై సౌందర రాజన్

కేసీఆర్ స్టాలిన్ ను కలవటం వలన మిగతా బిజేపియేతర వర్గాల్లో మిత్రభెధం పొడచూపుతుంది. నరేంద్ర మోడీ వైరిపక్షాలకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పై అపనమ్మకం మొదలైంది. ఇది నిజంగా ఆలోచిస్తే కేసీఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షాల సమాఖ్యలో మిత్రభేదం సృష్టించే పనిలో పడ్డారా? అనేది తీవ్ర ప్రశ్నార్ధకమైంది.  


తెలంగాణ ముఖ్యమంత్రి టీఅరెస్ అధినేత కేసీఆర్ — తనను కలిసిన అంశంపై వివరణ ఇచ్చుకునే పనిలోపడ్డ డీఎంకే అధినేత స్టాలిన్ ను తమిళ రాష్ట్ర బీజేపీ ఇరకాటం లో పడేసింది. కేసీఆర్ కలయిక తో పొడసూపిన అనుమానపు బీటలు — ఆపై బీజేపీ వ్యాఖ్యలు డీఎంకే చీఫ్ స్టాలిన్ ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీనితో బీజేపీ యేతర కూటమిలో తమకు ఎక్కడ మైలేజ్ తగ్గుతుందోనని స్టాలిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  


తమిళనాడులో పొత్తుకోసం డీఎంకే తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ పేర్కొనడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బీజేపీ ఆరోపణ లపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు ఋజువు చేయగలిగితే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని స్టాలిన్ సవాల్ విసిరారు. తమిళసై సౌందర్ రాజన్ చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే ఆమెతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.

బీజేపీతో కలిసేందుకు తాము ఏనాడు ప్రయత్నించలేదని ఆయన వివరణ ఇచ్చారు. తాము బీజేపీ యేతర కూటమిలో ఉన్నట్లు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందర్ రాజన్ మీడియా తో మాట్లాడుతూ, పొత్తు కోసం బీజేపీ తో డీఎంకే సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యానించారు. డీఎంకే  కొందరి ద్వారా బీజేపీ తో సంబంధాల కోసం సంప్రదింపులు సాగిస్తోందని స్పష్టం చేశారు. బీజేపీ విజయతీరాలను చేరబోతోందని స్పష్టం చేశారు. బీజేపీ విజయం తథ్యమంటూ "పోల్ ఎస్టిమేట్స్" తెలియజేస్తున్నాయంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: