ఎన్నిక‌ల త‌ర్వాత త‌ప్పంతా బాబు, ప‌వ‌న్‌పై నెట్టేసే ప్లాన్.. బీజేపీ కొత్త ఆట ఇదే..!

RAMAKRISHNA S.S.
ఏపీలో బీజేపీ అనుస‌రిస్తున్న విధానం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఈ పార్టీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుండ‌డం.. ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌చేస్తోంది. వాస్త‌వానికి.. కూట‌మిలో పొత్తు పార్టీగా ఉన్న బీజేపీ.. ఈ మేర‌కు త‌న పంథాను కూడా ఆవిష్క‌రించాలి. త‌న‌కు ఓటేస్తే..ఈ  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తారో కూడా చెప్పాలి. అదేస‌మ‌యంలో కూట‌మి పార్టీలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేనలు.. డైల్యూట్ కాకుండా చూడాలి. ఈ రెండు పార్టీల ప‌రువును కూడా కాపాడాలి.
కానీ, ఈ కోణంలో చూసుకుంటే.. బీజేపీ వేసిన‌, వేస్తున్న అడుగులు .. పూర్తిగా భిన్న ధ్రువాన్ని త‌ల‌పిస్తు న్నాయి. టికెట్ల నుంచి మేనిఫెస్టో వ‌ర‌కు, ప్ర‌చారం నుంచి అభ్య‌ర్థుల ఎంపిక వ‌ర‌కు కూడా.. బీజేపీ అనుస రిస్తున్న ధోర‌ణి.. కూట‌మిపై ప్ర‌భావం ప‌డేలా చేస్తోంది. ఇది .. ఆ పార్టీ ప‌రిస్తితిని ఏం చేస్తుంద‌నేది ప‌క్క‌న పెడితే.. ఇత‌ర పార్టీల‌పై మాత్రం తీవ్ర ప్ర‌భావం ప‌డేలా చేస్తోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లు.. బీజేపీ వైఖ‌రిని స‌మ‌ర్థించ‌లేక నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.
ఇలాంటి ప‌రిస్థితి కూట‌మి విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. ఒక‌వైపు.. పార్టీ పుంజ‌కోవాల‌ని సంక‌ల్పం చెప్పుకొన్నారు. ఆరు పార్ల‌మెంటు స్థానాల‌ను గుంజుకున్నారు. ప‌ది అసెంబ్లీ స్థానాల‌ను ఎంచుకున్నారు. ఇదేమీ త‌క్కువ కాదు. 1.5 లేదా 1 శాతం మాత్ర‌మే ఓటుబ్యాంకు ఉన్న బీజేపీకి ఈ రేంజ్‌లో టికెట్లు ఇచ్చిన కృత‌జ్ఞ‌త అయినా.. లేకుండా.. టీడీపీ విశ్వ‌స‌నీయత‌పై బీజేపీ యుద్ధం చేస్తోంద‌నే చెప్పాలి.
ఇదేస‌మ‌యంలో టీడీపీతో చేతులు క‌లిపి.. మ‌న‌సు మాత్రం జగ‌న్‌ద‌గ్గ‌ర పెట్టార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నా యి. ఇలా చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు?  ఎటు ఉండాల‌ని అనుకుంటే.. అటే ఉండే స్వేచ్ఛ ఉంది. ఈ విష‌యం కూడా.. బీజేపీ కంటే కూడా.. కూట‌మిలోని ఇరు పార్టీల‌పై ప్ర‌భావం చూపుతోంది. రేపు ఏదైనా తేడా వ‌స్తే.. నెపం చంద్ర‌బాబు, ప‌వ‌న్ల‌పైకి నెట్టేసినా ఏమీ అన‌లేని ప‌రిస్తితి ఏర్ప‌డింది. మొత్తంగా చూస్తే.. టికెట్ల నుంచి మేనిఫెస్టో వ‌ర‌కు బీజేపీ అనుసరించిన ధోర‌ణి అంతిమంగా టీడీపీపైనే ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: