ఏపీ: బెట్టింగ్ మాయాజాలమంతా ఆ పార్టీ వైపే..!

Divya
ఏపీలో ఈనెల 13వ తేదీన ఎట్టకేలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది.. అయితే ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పటి నుంచి కొన్ని హింసాత్మకమైన ఘటనాలు పలు ప్రాంతాలలో చోటు చేసుకుంటున్నాయి.. దింతో కొంత మంది నేతలను అధికారులు కూడా గృహనిర్బంధం చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓటింగ్ ప్రక్రియ అయిపోయినప్పటి నుంచి బెట్టింగ్ రాయల హవా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాలలో టిడిపి పార్టీ వైపు ఎక్కువగా ఈ బెట్టింగులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బెట్టింగులు వేయడం తప్పు.. బెట్టింగ్ చేయడం కూడా తప్పే.. అనవసరంగా చేతులు కాల్చుకోకుండా చూసుకోవడమే చాలా ముఖ్యము.. ఈసారి ఎన్నికల రిజల్ట్స్ పైన  ఏం జరుగుతుందనే విషయం పైన అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చూస్తే సత్తా బజార్ అని పిలవబడే బెట్టింగ్ మార్కెట్ లో మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కూటమికి 97 నుంచి 100  స్థానాలు గెలుస్తుందని ఎక్కువమంది బెట్టింగ్ కాసారట. ఇప్పుడు తాజాగా 107 నుంచి 110 స్థానాలు వస్తాయంటూ బెట్టింగ్ కాస్తున్నారట.

అయితే వీళ్ళు వేసుకున్న అంచనాల ప్రకారం 107 నుంచి 110 స్థానాలు టిడిపి గెలుస్తుందని 100 కి 110  ఇవ్వటానికి సిద్ధమవుతూ పందాలు కాస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాలలో ఇలాంటి పందాలు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి.. మరికొన్ని ప్రాంతాలలో కూడా వైసీపీ పార్టీ గెలుస్తుందని కోట్లల్లో కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అటు టిడిపి వైసిపి అధినేతలు కూడా తాము గెలుస్తామని ధీమాతోనే ఉన్నారు. మొత్తానికి జూన్ -4 వ తేదీ వరకు తాగితే ఎవరు గెలుస్తారనే విషయం పైన క్లారిటీ వస్తుంది.. వీరితోపాటు పవన్ కళ్యాణ్ నిలబడిన పిఠాపురం పైన లోకేష్ నిలబడిన మంగళగిరి పైన.. చంద్రబాబు నిలబడ్డ కుప్పం పైన కూడా భారీగానే బెట్టింగులు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: