జగన్ ఖాతాలోకి మరో కొత్త ఛానల్..?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో మీడియా కొన్ని పార్టీలకు అనుకూలంగా మారిన సంగతి తెలిసిందే. నిష్పాక్షికంగా వార్తలు ఇచ్చే మీడియాలు చాలా అరుదుగానే ఉన్నాయి. ప్రత్యేకించి ప్రముఖమైన పత్రికలు, ఛానళ్లు.. ఏదో ఒక స్టాండ్ తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ కొంత కాలంగా ఎల్లో మీడియా అంటూ ప్రచారం ఉధృతం చేశారు.



ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా హౌజులను ఎల్లో మీడియాగా వైసీపీ నాయకులు భావిస్తుంటారు. మనం తెలుగుదేశం నేతలతోనే కాదు.. ఈ ఎల్లో మీడియాతో కూడా పోరాడాలి అంటూ ఇటీవల పలు సభల్లో జగన్ తన కార్యకర్తలకు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన చెబుతున్న ఎల్లో మీడియా బ్యాచులో కొత్త ఛానల్‌ను చేర్చారు.



వచ్చే ఎన్నికలలో వైసీపీ పోరాడుతోంది ధర్మంగా నడిచే వ్యక్తులు, పార్టీతో కాదని, రాక్షసులతో అని విపక్ష నేత జగన్ నిన్నటి అనంతపురం సభలో అన్నారు. ఎన్నికలు దగ్గరబడే కొద్ది పాలకులుగా ఉన్నవారి అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని జగన్ అన్నారు. చంద్రబాబు ఆడే డ్రామాలు ఇన్ని అన్ని కాదు.. ఎల్లో మీడియాతో పోరాడుతున్నామంటూ ఆ ఎల్లో మీడియా ఎవరో క్లారిటీ ఇచ్చారు.



ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి5 తో పోరాడుతున్నాం అన్నారు జగన్. వీరందరితో పోరాడుతున్నాం... చంద్రబాబు అక్రమాలకు వీరంతా అండగా ఉంటున్నారు... వీటిని కూడా ఎదుర్కోవాలి... అంటూ జగన్ తన వైసీపీ సైన్యానికి సూచనలు చేశారు. పెద్ద ఎత్తున వైసీపీ అభిమానుల ఓట్లను తొలగించారని... ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఎవరివైనా ఓట్లు తొలగిస్తే వెంటనే మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: