ఆంధ్రాలో దమ్మున్నోళ్లు..! తెలంగాణలో దద్దమ్మలు..!?

Chakravarthi Kalyan
ఏపీ మంత్రి జవహర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీరును విమర్శిస్తూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఏపీలోని బీసీలకు తాను నాయకత్వం వహిస్తానని ఇటీవల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్న సంగతి తెలిసిందే.



తలసాని వ్యాఖ్యలపై మండిపడిన జవహర్.. తలసాని శ్రీనివాసయాదవ్ నాయకత్వం ఏపీకి అవసరం లేదన్నారు. మీలాంటి సన్నాసులు, దద్దమ్మల అవసరం మాకు లేదు.. మేం దద్దమ్మలను తెలంగాణలోనే వదిలేసి వచ్చేశాం. ఇక్కడంతా దమ్మున్ననేతలే అంటూ కౌంటర్ ఇచ్చారు.



ఆంధ్రాలో సన్నాసులు ఎవరూ లేరన్న జవహర్.. తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఆయన ముఖ్యమంత్రే ఓసారి సన్నాసి అంటూ చిరాకుపడిన విషయం మరచిపోవద్దని జవహర్ కామెంట్ చేశారు. బీసీలకు అన్నివిధాలా సహకరించింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి అన్నారు. ఓ యాదవ్‌ను టీటీడీ బోర్డు ఛైర్మన్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.



ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేస్తున్నారన్న వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు.మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ముందు వైసీపీ ముసుగు తొలగించి మాట్లాడాలని జవహర్ హితవు పలికారు. కేంద్రమంత్రులు వారాల అబ్బాయిల్లా ఏపీకి వస్తున్నారని జవహర్ ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: