స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం

మన స్నేహితులను బట్టే మన స్వభావం ఏమిటో చెప్పవచ్చు. పెద్దగా ఈ విషయంలో చర్చ అవసరం లేదు. మహాకూటమికి మహాఓటమితో పాటు ధారుణపరాభవం కూడా తప్పదు. అసలు తెలంగాణాలో తెలుగుదేశం పాదం మహావినాశనం అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ,తెలంగాణా జన సమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలు విడి విడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా తెలంగాణా రాష్ట్ర సమితి - టీఆరెస్ కి గట్టి పోటీ ఇచ్చి ఉండేవారు. కాని ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయటంతో వాటి శక్తి మొత్తం బిందెడు పాలలో టిడిపి విషం బిందువులా పనిచేసి మొత్తం మైత్రిని ముంచేసింది. 





అంతే కాదు ప్రక్క తెలుగు రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని పాత రేసిన తెలుగు దేశం అధినేత ఈ తెలుగు రాష్ట్రంలో ఎలా గెలవ గలరనేది మినిమం కామన్ సెన్స్ ఉన్నవారు అర్ధం చేసుకొగలగక పోవటం దురదృష్టం. దానికి తోడు ఓటుకు నోటు కేసు...దాని కథానాయకుడు రెవంత్ రెడ్డి విన్యాసాలు మొదటి నుండి గమనిస్తూ ఉన్న తెలంగాణా విఙ్జులైన ఓటర్లు తమ విఙ్జత నిరూపించుకొని నిశ్శబ్ధ నైజాన్ని ఓట్లు వేసెయ్యటం ద్వారా మూకుమ్మడిగా ప్రదర్శించారు.


వీటిని మించి పిరాయింపుదారులపై ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకై తాను స్వయంకృతాపరాధంగా చేసుకున్న వ్యాఖ్యలు ఆత్మహత్యా సదృశమై ఆ పాపం ఆయన నెత్తిపై బస్మాసుర హస్తంగా మారి దహించివేసింది. 





ఇక చివరి దశలో లగడపాటి రాజగోపాల్ తన ఆంధ్ర ఆక్టోపస్ అనే గౌరవ ప్రదమైన విలువలను కోల్పోయారు. ఒక్క చంద్ర బాబుకోసం తన నైతికతను కూడా ఫణంగా పెట్టటం ఎంత ధౌర్భాగ్యమో తెలంగాణా తెలుగువారు అర్ధం చేసుకున్నారు.  లగడపాటి సర్వె అంటూ చేసింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఆపై ప్రజాకూటమికి ప్రచారం చేశారని నిర్ద్వంధంగా చెప్పవచ్చు. 


ఉత్తం కుమార్ రెడ్డికి పోన్ చేసి తెలంగాణాలో కాంగ్రెస్ దే గెలుపని "రాజ్ దీప్ సర్దేసాయి" చెప్పాడన్నది పచ్చి అబద్ధం. ఎక్జిట్-పోల్స్ ద్వారా ఆయన మీడియా-హౌజ్  ఇండియా టుడే ప్రకటించిన వివరాలే (79-91)  టిఆరెస్ గెలుపే నిజమైంది.


ఇక సండ్ర వెంకటవీరయ్య విజయం అది ఆయన వ్యక్తిగత క్రెడిబిలిటీ మాత్రమే తప్ప మరేమీ లేదు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ విజయం లభించి ఉండేది. 


తెలుగుదేశం పార్టీతో అక్రమ సంబంధ పలితంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధులు ముఖ్యంగా సంపూర్ణ వైఫల్యం చెందారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: