విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు

భారత ఆర్ధిక నేఱగాడు, మునిగి పోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత ₹9000 కోట్లకు అనెక భారతీయ బ్యాంకులను ముంచేసి విదేశాలకు చెక్కేసి రెండున్నర సంవత్సరాలైంది. దాదాపుగా అప్పటి నుండీ యుకే కోర్టులతో పోరాడుతున్న భారత ప్రభుత్వం ఈ రోజు విజయం సాధించినట్లే. ఇందులో భారత విచారణ సంస్థల కృషి అద్భుతంగా పని చేసిందనే చెప్పాలి.

విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని వెస్ట్‌ మినిస్టర్ కోర్టు నేడు సోమవారం ఆదేశించింది. వేల కోట్ల రూపాయిల మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో గత రెండేళ్ళుగా ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ దర్యాప్తును తప్పించు కునేందుకు 2016 మార్చిలో లండన్ వెళ్ళిపోయారు. దీంతో ఆయనను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఆయనను భారతదేశానికి అప్పగించాలని కోర్టు ఆదేశించడంతో భారతదేశం దౌత్యపరమైన విజయం సాధించినట్లయింది.
 
మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీ లు బ్రిటన్‌ కోర్టులో బలంగా వాదించాయి. మాల్యా అప్పగింతపై కీలక నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో ముందుగనే సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు లండన్‌కు తరలివెళ్లారు. ఋణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్‌ మాల్యా భారత్‌ నుంచి పారిపోయి బ్రిటన్‌ లోని పనామా దీవుల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ అక్కడ తలదాచుకున్న సంగతి ప్రజలెరిగిందే. 

లండన్ లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు లో విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన సందర్భంగా దాన్ని ఎగువ కోర్టులో సవాల్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఆయనకు వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు కల్పించవచ్చు. మరోవైపు మాల్యా అప్పగింతకు కోర్టు నిరాకరిస్తే నిర్ధిష్ట గడువు లోగా సీబీఐ హైకోర్టు లో వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేసే అవకాశం ఉంటుంది.

అయితే మాల్యాను భారతదేశానికి అప్పగించాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పులో జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మాల్యా ఐడీబీఐ బ్యాంకుకు తప్పుడు పత్రాలు సమర్పించారని జడ్జి పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించారన్నారు.  ఈ తీర్పుపై మాల్యా అపీలు చేయడానికి అవకాశం ఉంది.
 
భారత ప్రభుత్వ అభ్యర్థనపై వెస్ట్‌మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ దర్యాప్తు చేసింది. మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఈ దర్యాప్తు నివేదిక వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చతికిలబడటం అనివార్యమని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ లేదని పేర్కొంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: