అన్నీ ఉచితాల రాజకీయంతో భారత జాతి, యువత మొత్తం నిర్వీర్యమే!


దేశంపై భక్తి ఉన్న రాజనీతిఙ్జులు ఏవరైనా ప్రజలకు ఉచితంగా ఏదీఇవ్వరు, ఇవ్వకూడదు. రోటీ, కపడా, మకాన్, విద్య, ఆరోగ్యం ప్రజా జీవితానికి మూలాధారాలు - వీటిలో మొదటి మూడు ఉచితంగా ఇవ్వకూడదు. చివరి రెండు అంటే ప్రజావిద్య, ప్రజాఆరోగ్యం విషయంలో తగిన విధాన రూపకల్పన చేసి ఆ రెండూ సమానం గా  అందరికి అందేలా చూడాలి. 

Madras HC: Free Rice Is Making People Lazy, Workers Being Brought From Northern States

రోటీ, కపడా ప్రజలే వారికి వారు సంపాదించుకునే ఉపాధి అవకాశాలు సామాజికంగా కలిగించాలి అంతేకాని, ఉచితం అంటూ అంతా ఇచ్చెస్తే, వారు ఇంకా చెసేదేముంది. తినటం, తాగటం, పిల్లల్ని కనటం తప్ప.  సామాజిక సమూహిక  గృహ నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తే సరి. ఈ మాత్రానికి వారు పని చేసే అవసరమే లేకుండా ఉచిత బియ్యం, ఉచిత నిత్యావసర వస్తువులు, ఉచిత కరంట్, ఉచిత గృహాలు, పాకెట్ ఖర్చులకు నిరుద్యో బృతి, ఇలా ఇవ్వటంతో యువత పనిచేసి సంపాదించాలి అన్న భావన మరచిపోయి నిరంతరం మందు, మగువలతో కాలం గడుపుతూ, ఫలితంగా సోమరితనం సంతానం కలిగి జాతిలో నిస్సత్తువ ఆవహిస్తుంది. దాన్నే క్లియరుగా చెన్నై ఉన్నత న్యాయస్థానం కొంతవరకు ఒక కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికే చేసింది.
 
 
బియ్యం తదితర నిత్యావసర సరుకులను ఉచితంగా ఇచ్చే పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దాని ఫలితంగా రాష్ట్రంలో పనుల కోసం ఉత్తర భారత దేశం నుంచి కార్మికులను తెచ్చుకోవాల్సి వస్తుందని పేర్కొన్నది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా బియ్యం ప్రభుత్వం ఇవ్వటానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన జస్టిస్ ఎన్. కిరుబంకరణ్, జస్టిస్ అబ్దుల్ ఖుద్దాస్‌ లతో కూడిన ధర్మాసనం, ప్రజల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా బియ్యం ఇవ్వడాన్ని తప్పుబట్టింది. 

While it was obligatory on the part of the government to provide bare necessities like rice and other groceries to the needy and poor people who are living under BPL (Below Poverty Line)


బియ్యం అక్రమరవాణా కేసులో నిందితుడైన ఒక వ్యక్తి, తనను గూండా చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన 'హెబియస్ కార్పస్ పిటిషన్' విచారణ సందర్భంగా హైకోర్టు గత గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతివారికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని కోర్టు తప్పుబట్టింది. 

పేదల కనీస అవసరాలైన బియ్యం, ఇతర సరుకులను అందజేయడం ప్రభుత్వాల బాధ్యత. అయితే రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాలు అందరికీ ఉచితంగా వస్తువులను అందజేస్తున్నాయి. ఉచితంగా వస్తువులు అందజేయడం వల్ల ప్రజలు సోమరి పోతులుగా మారిపోతారు అని ధర్మాసనం పేర్కొన్నది. అనంతరం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: